రాజకీయాల్లో బంధుత్వాలు పక్కన పెట్టాల్సిందె. పోటీకి దిగితె అక్కా,తమ్ముడు, నాన్న,కొడుకు, భార్యా,భర్తలాంటి బేధాలు ఉండవు. పోటీకి సై అంటె సై. సాధారణ ఎన్నికలు దగ్గర పడే కొద్ది రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికె గెలుపు గుర్రాల వేటలో మునిగితేలుతున్నారు. రాష్ట్రంల పార్టీల మధ్య ఎంత పోటీ ఉన్నా ఆ ఒక్క సీటులో మాత్రం పోటీ రసవత్తరంగా ఉంటుంది. ఆ సీటుకోసం ఎన్‌టీఆర్ వారసుల మధ్యే పోటీ ఉంటుందన్న వార్తలు ఆసక్తిరంగా ఉన్నాయి.
అనంతపురం జిల్లాలోని హిందూపురం లోక్ సభ స్ధానం. పార్టీ ఏర్పాటైన దగ్గర నుండి ఈ స్ధానం టిడిపికి ఎంతటి కంచుకోటో అందరికీ తెలిసిందే. అక్కడ టీడీపీ తరుపున ఎవరు పోటీచేసినా గెలుపు వాల్లదె. అటువంటిది ఎన్టీఆర్ వారసులే పోటీ చేస్తామంటే ఇక చెప్పేదేముంది ఇక రణరంగమే. భాజాపా-టీడీపీ పొత్తులో భాగంగా పురందేశ్వరి ఆసీటుపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో తాను అనంతపురం జిల్లా నుండే ఎంపిగా పోటీ చేయబోతున్నట్లు ఆమే స్వయంగా ప్రకటించారు. పోటీ చేయటానికి హిందుపురం సీటు తప్ప మరోటి లేదు. భాజాపా-టీడీపీ పొత్తులో భాగంగా ఆషీటును కేటాయించాలంటె బాబు అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం టీడీపీ ఎంపీగా ఉన్న నిమ్మళ కిష్టప్పను ఎమ్మెల్యేగా పోటీ చేయించి ఆస్థానంలో పోటీచేయాలని భావిస్తోంది.
అయితె పురంధేశ్వరికి ఊహించని ట్విస్ట్ ఎదురైనట్లు టిడిపిలో చర్చ మొదలైంది. ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ కూడా ఈ సీటుపైనే కన్నేసినట్లు సమాచారం. అంటే ఎన్టీఆర్ వారసుల్లోనే హిందుపురం పార్లమెంటు విషయంలో పోటీ తప్పదనిపిస్తోంది. న్టీఆర్ వారసుల్లోనే హిందుపురం పార్లమెంటు విషయంలో పోటీ తప్పదనిపిస్తోంది.
ఇదంతా బాగానె ఉన్నా అసలైన ట్విష్ట్ ఇక్కడే మొదలవనుంది. భాజాపా ఒంటరిగా ఎన్నిలకు వెల్తే హిందూపురం ఎంపీ షీటులో భాజారుపున పురందేశ్వరి నిలబడినా గెలవడం అసాధ్యం. అంటె ఇక్కడ ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఉందన్నమాట. జనసే ఎలాగో ఉండనే ఉంది. ఇద్దరిలో ఆ షీటును ఎవరికి కేటాయించినా మరో కరు పార్టీ మారకతప్పదు. ఇప్పటికె పురందేశ్వరి, హరికృష్న వైసీపీలోకి వెల్తారనె వార్తలు వినిపిస్తున్నాయి. ఎంపీ షీటు పక్కాగా కావాలంటె పార్టీ మారడం మినహా ఇంకొకటి ఉండదు. భవిష్యత్తులో ఏంజరుగుతుందో చూడాలి.
