Thursday, April 25, 2024
- Advertisement -

ప్రేమలో ప‌డ్డ సాయి ప‌ల్లవి !

- Advertisement -

మలయాళ హిట్ మూవీ “ప్రేమ‌మ్” సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మై.. మొద‌టి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టి సాయి ప‌ల్లవి. ఆ త‌ర్వాత ఫిదా, మారి 2, సూర్య మంటి చిత్రాల‌తో మ‌స్తు క్రేజ్ సంపాదించుకుంది ఈ హైబ్రిడ్ పిల్ల‌. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్‌లో ల‌వ్ స్టోరీ అనే సినిమాలో నాగ‌చైత‌న్య‌తో జోడీ క‌ట్టింది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

అయితే, తాజాగా సాయి ప‌ల్ల‌వి ప్రేమ‌లో ప‌డింది. ఏకంగా ప్రేమ పాటలు పాడుతూ.. చిందులు వేస్తోంది. ఎక్క‌డ‌బ్బా అనుకుంటున్నారా? అదే ఆమె న‌టిస్తున్న‘విరాటపర్వం’ మూవీలో. ద‌గ్గుపాటి రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడ‌ల‌ దర్శకత్వంలో ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ వేగంగా జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ఈ నెల 25న కోలు కోలు అనే లిరిక‌ల్ వీడియోను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

దీనిని సంబంధించి ‘విరాటపర్వం’ మూవీలోని సాయి ప‌ల్ల‌వి పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌లో సాయి ప‌ల్ల‌వి లంగా వోణీలో క‌నిపిస్తూ.. కాక‌తీయ తోర‌ణం వ‌ద్ద డాన్స్ చేస్తూ క‌నిపిస్తోంది. ఈ పోస్టర్‌పై ‘ప్రేమలో మునిగి ఉన్న వెన్నెల’ అంటూ సాయిపల్లవి ట్విట్టర్‌లో పేర్కొంది. విరాటప‌ర్వం విప్లవం, ప్రేమ, మహిళా సాధికారతతో ముడిపడి సాగుతుందనీ, ఏప్రిల్‌ 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ సినిమాలో ప్రియ‌మ‌ణి, నందితాదాస్‌ల‌తో పాటు నివేదా పేతురాజ్‌లు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఏనుగుపై నగ్నంగా ఫొటోల‌కు పోజులిచ్చిన అమ్మ‌డు.. తిక్కను కుదిరించిన నెటిజ‌న్లు!

నోటి పూత సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేసి ఉప‌శ‌మ‌నం పొందండి !

ప‌వ‌న్, రాజ‌మౌళి కాంబోలో మూవీ? ఇక సినిమా మాములుగా ఉండ‌దు !

ఉప్పెన’ గురించి సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఏమ‌న్నాడో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -