Sunday, May 4, 2025
- Advertisement -

రహస్యంగా పెళ్లి చేసుకున్న నటి… ఆ కారణం వల్లే ఎవరికీ చెప్పలేదు: సంజన

- Advertisement -

శాండిల్ వుడ్ డ్రగ్స్ మాఫియాలో ఆరోపణలు ఎదుర్కొని మూడు నెలల పాటు జైలులో గడిపిన నటి సంజన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరికీ తెలియ కుండా రహస్యంగా పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. నటి సంజన కర్ణాటకకు చెందిన డాక్టర్ పాషాను పెళ్లి చేసుకుంది. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో వీరి వివాహం జరగగా తాజాగా వీరి వివాహానికి సంబంధించినఫోటో ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆమె పెళ్లి ఎవరికీ తెలియకుండా చేసుకోవడానికి గల కారణాలను కూడా తెలిపారు.

తన పెళ్లి ఫిక్స్ కాగానే డ్రగ్స్ మాఫియా కేసులో ఆరోపణలు రావడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలోనే తన పెళ్ళి ఈ విషయాన్ని ఇండస్ట్రీ వర్గానికి చెందిన వారితో పంచుకోలేక పోయానని , అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పకుండా, రహస్యంగానే మా పెళ్లి జరిగిందని తెలిపారు.

Also read:హాలీవుడ్ సినిమా తీయనున్న రాజమౌళి..?

పెళ్లి తర్వాత అందరినీ పిలిచి గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించామని, అప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో లాక్ డౌన్ విధించడం వల్ల అది సాధ్యం కాలేకపోయిందని తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తేదర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన “బుజ్జిగాడు” చిత్రం ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సంజన ఆ తరువాత పలు సినిమాల్లో నటించినప్పటికీ మంచి విజయం దక్కకపోవడంతో కన్నడ పరిశ్రమకే పరిమితమైపోయింది.

Also read:రాజకీయనాయకుడిగా ఎన్టీఆర్.. అతని దర్శకత్వంలోనే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -