Saturday, April 27, 2024
- Advertisement -

హాలీవుడ్ సినిమా తీయనున్న రాజమౌళి..?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి చిత్రం ద్వారా జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో స్టార్ డమ్ సంపాదించుకున్న ఎస్.ఎస్.రాజమౌళి త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా బుల్లితెరలో ప్రసారమయ్యే “ఆలీతో సరదాగా” కార్యక్రమానికి విచ్చేసిన దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, కథారచయిత విజయేంద్రప్రసాద్ తన కొడుకు రాజమౌళి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టులకు సంబంధించిన ఈ విషయాలను ఈ కార్యక్రమం ద్వారా తెలిపారు.

Also read:నేను పూర్తిగా వెజిటేరియన్.. కానీ ఆ షాపులో నాపేరా.. సోను సూద్

ఈ క్రమంలోని దర్శకుడు రాజమౌళి త్వరలోనే హాలీవుడ్ చిత్రం నిర్మించబోతున్నారని తెలిపారు. ఈ సినిమా కోసం తాను యానిమేషన్ విధానంలో ఒక కథను సిద్ధం చేసినట్లు విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామ్యంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. అయితే హాలీవుడ్ సినిమా పై రాజమౌళి ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోవడం గమనార్హం.

Also read:ఆ విషయంలో నన్ను క్షమించండి అంటున్న కొత్త పెళ్ళికూతురు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -