Tuesday, April 23, 2024
- Advertisement -

రాజకీయనాయకుడిగా ఎన్టీఆర్.. అతని దర్శకత్వంలోనే..?

- Advertisement -

నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్”చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.

ఈక్రమంలోనే కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన జనతాగ్యారేజ్ ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

Also read:లాక్ డౌన్ ఎఫెక్ట్: పెయింటర్ గా మారిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్?

ఇదిలా ఉండగా తారక్ తన తర్వాత సినిమాని కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కే సినిమాలో ఎన్టీఆర్ ను ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. రాజమౌళి, కొరటాల శివ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్, తారక్ సినిమా ప్రారంభం కానుంది.

Also read:నేను పూర్తిగా వెజిటేరియన్.. కానీ ఆ షాపులో నాపేరా.. సోను సూద్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -