Thursday, April 25, 2024
- Advertisement -

నటి సంజనకు అశ్లీల సందేశాలు.. పోలీసుల విచారణలో ఏం తేలిందంటే..?

- Advertisement -

నటి సంజన గల్రానీ మరోసారి వార్తల్లో నిలిచింది. తన మొబైల్‌కు అశ్లీల సందేశాలు పంపాడంటూ సంజన ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫ్యాషన్ డిజైనర్ కుమారుడైన ఆ యువకుడిని బెంగళూరు ఇందిరానగర పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నటి సంజనకు అతడు అశ్లీల సందేశాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ సందేశాలను పోలీసులకు సంజన అందించింది.

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హీరోయిన్ సంజనా గల్రాని. వివాదాలు చుట్టు తిరిగే ఈ స్టార్.. రీసెంట్ గా డ్రగ్స్ కేసులో నానా అవస్థలు పడి… అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చింది. వచ్చీ రావడంతోనే తన చిరకాల మిత్రుడు డాక్టర్ పాషాను పెళ్లి చేసుకుంది. రీసెంట్ గా కూడా కొన్ని వివాదాలు ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి.

కన్నడతో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించింది సంజన. ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్ లో ఆమె అందరికి గుర్తుండిపోయింది. ఈసినిమా తరువాత పెద్దగా చెప్పుకోదగ్గ ఆఫర్లు ఏమీ రాలేదు. డ్రగ్స్ కేసులో ఇరుక్కుని ఇబ్బందులు పడ్డ సంజన..చాలా వివాదాల్లో చిక్కుకుంది. కరోనా తీవ్రంగా ఉన్న టైంలో బెంగళూరులో మాస్క్ పెట్టుకోకుండా తిరిగి ట్రోల్స్ కు గురైయింది. అంతకు ముందు క్యాబ్ డ్రైవర్ తనను ఇబ్బంది పెట్టాడంటూ.. కేసు పెట్టి తానే చిక్కుల్లో పడింది సంజన.

ఆ హీరోను ఒంట‌రిగా క‌ల‌వ‌నందుకు సినిమా నుంచి తీసేశారు

సమంత, నాగచైతన్య మళ్లీ కలవబోతున్నారా ?

సర్జరీతో మరింత అందం పోందిన హీరోయిన్స్ వీరే…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -