టాలీవుడ్లో అగ్ర హీరోలందరితో సినిమాలు చేసిన బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.90లలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సోనాలి బింద్రే అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ భాషల్లో నటించిన ఈమె అప్పట్లో ఓ వెలుగు వెలిగింది.
తాను క్యాన్సర్తో పోరాడుతున్నానని ఆమె స్వయంగా తన ట్వీట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. ”చిన్న నొప్పి రావడంతో హాస్పిటల్ కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నాను. అప్పుడు నాకు క్యాన్సర్ ఉందని తెలిసింది. సమస్య ఏంటి అనేది స్పష్టంగా తెలియడం లేదని చెప్పుకొచ్చింది.సోనాలి బింద్రే తెలుగులో మహేశ్,చిరంజీవి,బాలకృష్ణ వంటి హీరోలతో పని చేసింది.