- Advertisement -

ఎవ‌రు ఈ శ్రీరెడ్డి అలియాస్ శ్రీలేఖ? చెప్పేదాంట్లో వాస్త‌వం ఎంత‌?

- Advertisement -

సంచ‌ల‌నం కోసం ఏమా ఆరోప‌ణ‌లు… ఇండ‌స్ట్రీ మొత్తం త‌ప్పుప‌ట్ట‌డం ఏమిటీ?
‘‘ప‌క్క‌లోకి వ‌స్తేనే సినిమా అవ‌కాశాలు వ‌స్తాయ‌ని.. ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు, కెమెరామెన్‌లు, పంపిణీదారులు త‌మ ఆనందం తీరిస్తేనే చాన్స్‌లు ఇస్తారు అని.. చివ‌రికి రాజ‌కీయ నాయ‌కుల‌ను కూడా తాము సంతృప్తిప‌ర‌చాల‌ని.. ఆఫర్ల కోసం ఎంతమంది పక్కల కింద నలగాలో.. అలా చేసినా ఆఫర్ వస్తుందో లేదో’’ అని ఇటీవ‌ల శ్రీరెడ్డి అనే మేడ‌మ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆ వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో న‌డుస్తోంది. ఆ త‌ర్వాత ఆమె వివిధ చాన‌ల్స్‌ల‌కు పోయి సినీ ప‌రిశ్ర‌మ‌పై వివాదాస్ప‌ద ఆరోప‌ణ‌ల‌తో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న శ్రీరెడ్డిపై సినీ ప‌రిశ్ర‌మ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

సినీ ప‌రిశ్ర‌మ‌లో చేసింది చిన్న సినిమాలే.. అవి కూడా రెండు, మూడు సినిమాలే. అలాంటి ఆమె ప‌రిశ్ర‌మన్నంతా ఏకి ప‌డేస్తోంది. సినిమాలో ఉన్న వాళ్లంద‌రూ అలాంటి వాళ్లే అని చెబుతోంది. రెండు, మూడు సినిమాల‌కే టాలీవుడ్ అంతా అనేంత ధైర్యం ఎలా వ‌చ్చింది? యాంక‌రింగ్‌గా కెరీర్ ప్రారంభించి ఏదో కొన్ని సినిమాలు చేసింది. ఏ ఫిలిం బై అరవింద్‌-2, త‌మిళంలో స‌మురాయ్ త‌దిత‌ర పాత్ర‌ల్లో చిన్న‌పాటి పాత్ర‌ల్లో న‌టించింది. ఆ సినిమాలు వ‌చ్చిన‌వి కూడా దాదాపు ఐదారేళ్ల కింద‌ట‌.

అప్ప‌టి ఆమె ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంపై అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. ఇన్నాళ్లు ఏం చేసింది? ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు వ‌చ్చింది? ఈ విధంగా వ్యాఖ్య‌లు చేసి సినిమా అవ‌కాశాలు పొందుదామా అని ఆమె ఆలోచ‌న‌నా? అని ప‌లు సందేహాలు వ‌స్తున్నాయి.

ఇంత‌కు ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్న శ్రీరెడ్డి అలియాస్ శ్రీలేఖ మ‌ల్లిడి ఎవ‌రో తెలుసా? ఒక‌ప్పుడు చిన్న చానెల్‌లో యాంక‌ర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత రెండు మూడు చాన‌ల్స్‌లో తిరిగింది. ఆ స‌మ‌యంలోనే పొట్టిపొట్టి బ‌ట్ట‌లు వేసుకొని వ‌చ్చిన ఆమెపై అప్ప‌ట్లోనే తీవ్రంగా విమ‌ర్శించారు. ఆ త‌ర్వాత ఏ విధంగా ఆమెకు అవ‌కాశాలు వ‌చ్చాయో ఏమో తెలియ‌దు కానీ ఇప్పుడు ఓ తెగ విమ‌ర్శిస్తోంది సినీ ప‌రిశ్ర‌మ‌ను. తెలుగే కాదు త‌మిళ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో కూడా ఇలాంటివి ఉన్నాయ‌ని చెబుతోంది.

ఇంత చెబుతున్న ఆమె ఏమైనా ****? ఆమె ఫేసుబుక్ ఓపెన్ చేస్తే అన్నీ అలాంటి ఫొటోలే! ఆమె పేరును యూట్యూబ్‌లో కొడితే అన్నీ ఆ సీన్ల‌వే వ‌స్తాయి. నాలుగు రోజుల పాటు హ‌ల్‌చ‌ల్ చేయ‌డానికి మీడియా ముందుకు వ‌చ్చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఆమె బాగోతం తెలిసిన వారంద‌రూ ఏమ‌మ్మా నీ వేషాలు మాకు తెలియ‌దా? టీవీ ముందుకు వ‌చ్చి ఏమిటీ నీ మాట‌లు.. అని అనుకుంటున్నారు.

ఏదో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరు చెప్పేసి కొంచెం క్రేజీ సంపాదించుకోవ‌చ్చు అని భావిస్తుందేమో. అయినా పెద్ద పెద్ద చాన‌ల్స్ కూడా ఇలా ఆమెను బండ బూతులు మాట్లాడించేస్తున్నారు. ఏది ఉన్నా యూట్యూబ్‌లో ట్రెండింగ్ కోసం.. చాన‌ల్స్ రేటింగ్స్ కోసం ఇలా అనామ‌కులైన వారిని తీసుకొచ్చి ఆరోప‌ణ‌లు చేయించ‌డం అల‌వాటుగా మారింది. ఇంత దిగ‌జారుడు సోష‌ల్ మీడియా వాళ్ల‌కు.. చాన‌ల్స్‌కు ఉండ‌డం మేధావులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

స్టెరాయిడ్స్ తీస్కొని బాడీని షేప్ చేస్కొని ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన ఆమె ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం ఇండ‌స్ట్రీ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. అలాంటి వాటిని ప్రోత్స‌హిస్తున్న మీడియాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -