Thursday, May 30, 2024
- Advertisement -

సీనియ‌ర్స్‌ను కుమ్మేద్దాం అంటున్న కుర్ర హీరో

- Advertisement -

ఏమ‌య్యా.. నితిన్ మ‌రో హిట్‌ కొట్టేలా ఉన్నావే!

క‌ళాశాల నేప‌థ్యంలో ఒక హిట్ కొట్టిన నిఖిల్ సిద్ధార్థ ఇప్పుడు మ‌రో సినిమా అలాంటి జోన‌ర్‌లోనే వ‌స్తున్నాడు. క‌న్న‌డ‌లో సూప‌ర్‌హిట్‌గా నిలిచిన ‘కిరాక్‌పార్టీ’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తూ అదే పేరుపై విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యి విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ‘వాడు సీఎస్‌ఈ, ఈసీ, నేను మెక్‌ అనే భేదాభావాలొద్దు. మనమంతా ఒక్కటి. మన దెబ్బకు సీనియర్స్‌ అబ్బా! అనాలి’ అని నిఖిల్ సీనియ‌ర్స్ కొట్టే ప‌నిలో బిజీగా ఉన్నాడు.

సంయుక్త హెగ్డే హీరోయిన్‌గా నిఖిల్ క‌ళాశాల కుర్రాడిగా ‘కిరాక్‌పార్టీ’ సినిమాలో న‌టిస్తున్నారు. శరణ్‌కొప్పిశెట్టి దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను మంగళవారం (మార్చి 13) విడుదల చేశారు. ఈ సినిమాలో నిఖిల్ కొంచెం కాలేజీ స్టూడెంట్‌గా క‌నిపించ‌డానికి స‌న్న‌బ‌డ్డాడు.

ఇంజినీరింగ్‌ విద్యార్థుల క‌ళాశాల జీవితం.. స్నేహం, ప్రేమ, సీనియర్స్‌, జూనియర్స్‌ మధ్య గొడవలు ఇలా ఈ ఇతివృత్తంలో సినిమా రూపొందించిన‌ట్లు తెలుస్తోంది. కన్నడలో ఘన విజయం సాధించిన ‘కిరిక్‌పార్టీ’ని తెలుగులో ‘కిరాక్‌పార్టీ’ పేరుతో రీమేక్‌ చేశారు. యువ దర్శకుడు సుధీర్‌ వర్మ స్క్రీన్‌ప్లేను తీర్చిదిద్దగా, మరో దర్శకుడు చందూ మొండేటి మాట‌లు అందించారు.అజనీష్‌ లోకనాథ్ సంగీతం అందించ‌గా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా మార్చి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -