Thursday, May 16, 2024
- Advertisement -

బిక్ష‌గాడు కాదు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌

- Advertisement -

‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ అమితాబ్ లుక్ లీక్‌

మాచిపోయిన రుమాలు.. ప‌గిలిన క‌ళ్ల‌ద్దాలు.. మాసి పెరిగిన‌ గ‌డ్డం.. బ‌క్క‌చిక్కిన మొఖం ఈ అవతారంలో ఉన్న‌ది బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. ఆయ‌న బాలీవుడ్ మిస్ట‌ర్‌ పర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్‌తో కలిసి నటిస్తున్న సినిమా ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’. ఈ సినిమా షూటింగ్ పూర్త‌వుతోంది. అయితే ఈ సినిమాలో బిగ్ బీ లుక్ ఇటీవ‌ల లీకైంది. ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అస‌లు ఆ లుక్‌లో ఉన్న‌ది బిగ్ బీనా అని గుర్తుప‌ట్ట‌లేనంత‌గా ఉన్నారు. న‌ట‌న‌కు ప్రాణం పోసే న‌టులో అమితాబ్ ఒక‌రు.

ఇప్పటికే ఆమిర్‌ఖాన్‌కు సంబంధించిన లుక్స్‌ బయటకు వచ్చాయి. ఆ ఫొటోలు అభిమానుల‌కు బీభ‌త్సంగా న‌చ్చేయ‌గా ఇప్పుడు బిగ్ బీ లుక్ అల్టీమేట్‌గా ఉంది. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌లో ‘ఫిలిఫ్‌ మెడోస్‌ టేలర్‌’. రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని ఈ సినిమాను దీపావళి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌నున్నార‌ట‌. ఇద్ద‌రు స్టార్లు అమితాబ్‌, ఆమిర్‌ఖాన్ న‌టించిన సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కులు, అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. ఈ సినిమా బాలీవుడ్ రికార్డుల‌న్నీ తిర‌గ‌రాసే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -