Monday, April 29, 2024
- Advertisement -

అంతరిక్షం’ హీరోయిన్ తో ‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు

- Advertisement -

‘ఆర్ ఎక్స్ 100’ వంటి బోల్డ్ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించిన అజయ్ భూపతి తర్వాత సినిమా ఎలా ఉండబోతోందో అని అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా అజయ్ భూపతి తన రెండవ సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి తన సినిమాలో మాస్ మహారాజా రవితేజ ని ఎంపిక చేశారు. తాజాగా హీరోయిన్ పాత్ర గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అదితి రావు హైదరి ని ఎంపిక చేశారని సమాచారం. ఇప్పటికే ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అదితీరావ్ హైదరీ ‘అంతరిక్షం’ సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించింది. అజయ్ భూపతి నెరేట్ చేసిన స్క్రిప్ట్ బాగా నచ్చడంతో ఆమె వెంటనే ఈ సినిమాని ఓకే చేసేసిందట. సినిమా కోసం ‘మహాసముద్రం’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ ‘డిస్కో రాజా’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తవగానే అజయ్ భూపతి సినిమాని సెట్స్పైకి తీసుకెళ్లబోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -