Tuesday, May 14, 2024
- Advertisement -

టూ స్టేట‌స్ రీమేక్‌లో బాహుబ‌లి న‌టుడు

- Advertisement -

క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్న అడవి శేష్‌కు క్షణం సినిమా హీరోగా మంచి బ్రేక్ ఇచ్చిందిజ. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత అడ‌వి శేష్‌కు మంచి అవ‌కాశాలు వ‌చ్చాయి. అమీతుమీ సినిమాలో కామెడీ పండించిన ఈ హీరో ఓ రీమేక్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఓ బాలీవుడ్ సినిమాను తెలుగులోకి తెచ్చే పనిలో పడ్డాడు.

హిందీలో సూపర్ హిట్టయిన టు స్టేట్స్ సినిమా తెలుగు రీమేక్‌లో అడవి శేష్ హీరోగా చేయబోతున్నాడని తెలుస్తోంది. చేతన్ భగత్ రాసిన టు స్టేట్స్ నవల ఆధారంగా హిందీలో అదే పేరుతో సినిమా తీశారు. అర్జున్ కపూర్ – ఆలియా భట్ జంటగా నటించిన ఈ సినిమా బాగా ఆడింది. తెలుగులో ఈ సినిమాను కొత్త డైరెక్టర్ వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తీయ‌నున్నారు. ఎం.ఎల్.వి. సత్యనారాయణ నిర్మించనున్నారు. ఈ సినిమాలో అల‌నాటి హీరోయిన్ కుమార్తెను తీసుకునే అవ‌కాశం ఉంది.

టు స్టేట్స్ ఒరిజినల్ కథలో ఒక నార్త్ ఇండియన్ అబ్బాయి ఓ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడి.. వాళ్ల తల్లిదండ్రులను పెళ్లికి ఎలా ఒప్పించగలిగారనే కథతో టు స్టేట్స్ సినిమా కొన‌సాగుతుంది. స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసి తెలుగులో తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉంది.

https://www.youtube.com/watch?v=LGY94Ww1dsM

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -