Monday, April 29, 2024
- Advertisement -

టీ-20 ర్యాంకింగ్స్ లో ఇండియాకన్నా ముందున్న పాకిస్థాన్…

- Advertisement -

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన తాజా టీ-20 ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ కంటే ఇండియా వెనుక బ‌డింది. న్యూజిలాండ్ తొలి స్థానంలో నిలువగా, పాకిస్థాన్, భారత్ లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 126 పాయింట్లతో న్యూజిలాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, పాకిస్థాన్ (124), ఇండియా (121), ఇంగ్లండ్ (119), వెస్టిండీస్ (115) టాప్-5లో ఉన్నాయి.

ఆ తరువాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, జింబాబ్వే, యూఏఈ, నెదర్లాండ్స్, హాంకాంగ్, పీఎన్జీ, ఒమన్, ఐర్లాండ్ దేశాలున్నాయని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్థాన్ తో జరిగిన టీ-20 మ్యాచ్ లో 47 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించడంతో ర్యాంకింగ్స్ మారిపోయాయని ఐసీసీ అధికారి ఒకరు తెలిపారు. పాకిస్థాన్ ఈ నెల 22, 25, 28న మూడు టీ-20 మ్యాచ్ లను ఆడనుండగా, ఈ మూడింటిలో కనీసం రెండింటిలో గెలిస్తే, టాప్ ప్లేస్ కు చేరుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -