క్రిష్ -4 లో కియారా అద్వానీ!!

- Advertisement -

తన సొగసరి చూపులతో అభిమానుల్ని కట్టిపడేసే బాలీవుడ్ అందాల భామ కియారా అద్వానీ బాలీవుడ్ స్టైలిష్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. దీనికి సంబంధించిన వార్త ఒకటి ప్రస్తుతం సామాజిక మధ్యమాలలో హల్ చల్ చేస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజాగా నటిస్తున్న చిత్రం క్రిష్ -4.

క్రిష్ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండగా, తాజాగా క్రిష్ -4 చిత్ర యూనిట్ బాలీవుడ్ అందాల భామ కియారా అద్వానీని సంప్రదించగా, ఈ అందాల భామ ఈ ఆఫర్ ను వెంటనే ఓకే చేసిందని బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. తన అందాల హావభావాలతో టాలీవుడ్ లో కియారా వినయ విధేయ రామ, భరత్ అనే నేను చిత్రాలలో నటించి తనకుంటూ సొంత అభిమాన గణాన్ని ఏర్పరుచుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ భామ బాలీవుడ్ కలల రాకుమారుడు హృతిక్ తో కలసి వెండి తెరపై చేసే సందడి చూడాలంటే అభిమానులు మరికొంత కాలం వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -