Thursday, April 25, 2024
- Advertisement -

ల్యాండింగ్ చివరి క్షణంలో పేలిపోయింది.. ఎలా అంటే..?

- Advertisement -




ప్రైవేటు అంతరిక్ష దిగ్గజ సంస్థ స్పేస్​ఎక్స్ ప్రయోగించిన స్టార్​షిప్.. ల్యాండింగ్ చివరి క్షణంలో పేలిపోయింది. గాలిలో కొన్ని మైళ్ల పాటు ప్రయాణించిన ఈ అధునాతన నౌక.. ముందుగా నిర్ణయించిన ల్యాండింగ్ ప్రాంతానికే చేరుకుంది. అయితే ఆఖరి నిమిషంలో సమస్య తలెత్తి పేలింది. మొత్తం ప్రయోగం ఆరు నిమిషాల 42 సెకన్ల పాటు సాగింది. ఈ అత్యాధునిక స్టార్​షిప్​ను 8 మైళ్లు (12.5 కిలోమీటర్లు) ఎత్తు వరకు పంపించి.. తిరిగి భూమిపై సురక్షితంగా నిలువుగా ల్యాండ్​ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంత ఎత్తు వరకు స్టార్​షిప్​ను పంపటం ఇదే తొలిసారి.

అయితే ఈ ప్రయోగం ‘విజయవంతమైన ముందడుగు’ అని అభివర్ణించారు స్పేస్ఎక్స్ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్. ఇంధన ట్యాంకుల్లో ఒత్తిడి తగ్గిందని, ల్యాండింగ్​ కోసం ఇంజిన్లను మండించేసరికి స్టార్​షిప్ వేగంగా కిందకు పడిపోయిందని చెప్పారు. అవసరమైన సమాచారం మొత్తం సేకరించినట్లు స్పష్టం చేశారు.ఈ ప్రయోగం విజయవంతం కావడానికి మూడింట ఒకవంతు అవకాశాలు మాత్రమే ఉన్నాయని మస్క్ ఇదివరకే పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రయోగం ఓసారి వాయిదా పడింది. బుధవారం జరపాలని నిర్ణయించగా.. ప్రయోగానికి 1.3 సెకన్లు మిగిలి ఉండగా నిలిపివేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -