Tuesday, May 6, 2025
- Advertisement -

గౌతం మీనన్ కి రాం చరణ్ కండిషన్ లు

- Advertisement -

గౌతం మీనన్ తో గోవిందుడు అందరి వాడెలే తరవాతే ఒక సినిమా చెయ్యాల్సి ఉన్న రాం చరణ్ ముందుగా మాట ఇచ్చినందుకు గాను శ్రీను వైట్ల తో సినిమా కి ఓకే చెప్పేసాడు,

గౌతం మీనన్ కి తెలుగు లో ఏం మాయ చేసావే తప్ప హాట్ సినిమాలు లేవు. రాఘవన్, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ లాంటి డబ్బింగ్ సినిమాలు కాస్త పరవాలేదు అనిపించినా డైరెక్ట్ సినిమా లు ఘర్షణ లాంటివి జనాలకి ఎక్కలేదు. విమర్శకుల ప్రశంసలు అందుకునే గౌతం తెలుగు వ వారితో కనెక్ట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు.ప్రస్తుతం నాగ చైతన్యతో ‘సాహసం శ్వాసగా సాగిపో’ అంటూ ‘ఏ మాయ చేశావే’ మ్యాజిక్‌ను రిపీట్ చేసే పనిలో ఉన్న గౌతమ్, ఆ సినిమా పూర్తైన వెంటనే రామ్ చరణ్ సినిమాకు సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా స్క్రిప్ట్ విషయం లో రాం చరణ్ కూడా సొంతగా చొరవ తీసుకుంటూ కాస్త కమర్షియల్ హంగులు దట్టించాలి అని లేదంటే తెలుగు వారికి నచ్చే అవకాశమే లేదు అని అలా అయితే నే తాను సినిమా తీస్తాను అని ఖరాఖండి గా చెప్పెసినట్టు సమాచారం. ఇక రామ్ చరణ్ దర్శకుడు శ్రీనువైట్లతో చేస్తోన్న బ్రూస్‌లీ వచ్చే నెలలో విడుదలకు సిద్దం అవుతోంది ఈ సినిమా అవ్వగానే గౌతం తో చిత్రం పట్టాలు ఎక్కేస్తుంది 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -