Wednesday, May 8, 2024
- Advertisement -

సూపర్ స్టార్ తో ‘తల’పడుతున్న స్టార్ హీరో.. రంజుగా మారిన దీపావళి వార్ ..!

- Advertisement -

సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయనకు సౌత్ లోనే కాదు ఇండియా మొత్తంమీద అభిమానులు ఉన్నారు. మార్కెట్ కూడా వుంది. అయితే కోలీవుడ్ లో ఇప్పటి తరం హీరోల్లో తల అజిత్ అగ్రహీరోగా దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పింక్ రీమేక్ నెర్కొండ పారవై సూపర్ హిట్ తర్వాత ఆ సినిమాకు డైరెక్షన్ చేసిన వినోద్ తోనే అజిత్ ఓ సినిమా చేస్తున్నాడు. వలిమై పేరుతో తెరకెక్కుతున్న సినిమా హాలీవుడ్ రేంజులో రూపొందుతోంది.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించింది. ఈ సినిమా పై ట్రేడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు సిరుతై శివ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న సినిమా అన్నాత్తే. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కుటుంబ కథా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేస్తున్నట్లు సన్ పిక్చర్స్ ప్రకటించింది.

అయితే తాజాగా అదే తేదీన అజిత్ వలిమై కూడా విడుదల అవుతున్నట్లు సమాచారం. తమిళనాడులో దీపావళి అతి పెద్ద పండుగ. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తుంటారు. పండుగ సెలవులు క్యాష్ చేసుకునేందుకు దీపావళికి అక్కడ భారీగా సినిమాలు విడుదలవుతుంటాయి. అందుకే రజనీ నటించే సినిమా దీపావళి బరిలో ఉన్నప్పటికీ అజిత్ వలిమై సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత బోనీకపూర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పోటీలో సూపర్ స్టార్ రజినీకాంత్, తల అజిత్ లలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

Also Read

మరో ప్రయోగానికి సిద్ధమైన కమల్..!

అల్లూ ఫ్యాన్స్.. వెయిటింగ్ అక్కర్లేదు.. పుష్పరాజ్ వచ్చేది ఈ ఏడాదే..!

బాహుబలిని వెనకేసిన రాకీ బాయ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -