Saturday, May 4, 2024
- Advertisement -

సెట్స్ పైకి రాజశేఖర్ హీరోగా ‘కల్కి’

- Advertisement -

చాలాకాలం తరువాత ‘గరుడ వేగ’ సినిమాతో రాజశేఖర్ అనూహ్యమైన విజయాన్ని అందుకున్నాడు. చందమామ కథలు, గుంటూరు టాకీస్‌ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్స‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇందెలో రాజ‌శేఖ‌ర్ న‌ట‌న అద‌ర్భుతం.

రాజ‌శేఖ‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా ఒప్పుకోలేదు. దానికి కార‌నం తాను న‌టించే సినిమా గ‌రుడ‌వేగ స్థాయిలో ఉండాల‌నే ఉద్దేశ్యంతో మంచి క‌థ‌ల కోసం వెయిట్ రాజశేఖర్‌కు ‘అ!’ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక కథను వినిపించాడు.

కథలోని వైవిధ్యం కారణంగా .. ఇంతవరకూ తాను ఈ తరహా సినిమా చేయకపోవడం వలన వెంటనే రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాకి ‘కల్కి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. త్వరలోనే ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి .. సెట్స్ పైకి వెళ్లడానికి ప్రశాంత్ వర్మ సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఈ సినిమాతో పాటు ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలోను రాజశేఖర్ ఒక సినిమా చేయనున్నాడు. తమిళంలో ధనుష్ దర్శకత్వంలో హిట్ కొట్టిన ‘పవర్ పాండి’కి తెలుగులో ఇది రీమేక్. క‌ల్కి గ‌రుడ వేగ స్థాయిని అందుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -