Thursday, May 9, 2024
- Advertisement -

మ‌హాన‌టిపై జ‌క్క‌న్న‌, ద‌ర్శ‌కేంద్రుడు ఏమ‌న్నారంటే….?

- Advertisement -

సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన లెజెండరీ యాక్టర్ సావిత్రి బయోపిక్ మూవీ ‘మహానటి’ భారీ అంచనాల నడుమ బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహానటి చరిత్రను అద్భుతంగా తెరకెక్కించారంటూ సినీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కీర్తి సురేష్ ఈసినిమాలో సావిత్రి పాత్ర‌లో జీవించింద‌నే చెప్పాలి. ఈ సినిమాపై జ‌క్క‌న్న‌, ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావులు స్పందించారు

రాఘవేంద్రరావు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ఒకటి. 28 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఆ సినిమా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. అదే బ్యానర్ నుంచి ఇదే రోజున ‘మహానటి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని గురించి రాఘవేంద్రరావు ట్విట్టర్ ద్వారా స్పందించారు.

28 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారీ వర్షం. చాలా పెద్ద సినిమా తీశాము అనే ఆనందం .. ఎలా ఆడుతుందోననే భయం. ఎప్పుడు వరద ఆగుతుందా అని ఎదురుచూము. ఎట్టకేలకు సాయంత్రం నుంచి జనాలు థియేటర్ల వైపు కదిలారు. మరుసటి రోజు నుంచి అభిమానుల రూపంలో థియేటర్లకు వరదరావడం మొదలైంది. మా దత్తు (అశ్వనీదత్) గారికి ఆ రోజున ఎంత ఆనందం వేసిందో మరిచిపోలేను. ఆ సినిమా విడుదలైన రోజునే ‘మహానటి’ విడుదల కావడం విశేషం. అప్పట్లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో .. ఇప్పుడు ‘మహానటి’ నిర్మాణానికి అంతే ధైర్యం కావాలి. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శక నిర్మాతలకు .. ప్రధానమైన పాత్రలను పోషించిన కీర్తి సురేశ్ .. దుల్కర్ సల్మాన్ లకు .. చిత్ర యూనిట్ కి అభినందనలు” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

దర్శక దిగ్గజం రాజమౌళి స్పందించారు. గొప్ప చిత్రాన్ని తీశారంటూ నాగ్ అశ్విన్, స్వప్నలను అభినందించారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయిన తీరు సూపర్బ్ అంటూ కితాబిచ్చారు. తన జీవితంలో తాను చూసిన అత్యద్భుత పర్ఫామెన్స్ లలో ఈ చిత్రంలో కీర్తి సురేష్ ది ఒకటని చెప్పారు. మహానటికి ఆమె మళ్లీ జీవం పోశారని కితాబిచ్చారు. దుల్కర్ సల్మాన్ నటన అద్భుతంగా ఉందని… అతనికి తాను ఇప్పుడు ఫ్యాన్ గా మారిపోయానని ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -