Tuesday, May 21, 2024
- Advertisement -

లీకైన మహేష్ సినిమా కథ ఇదే!

- Advertisement -
again koratala shiva direct to mahesha babu

టాలీవుడ్ లో ఓ హీరోకి పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడుతో మళ్లీ పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అదే విధంగా గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా భారీ విజయం సాధించింది. మళ్లీ ఈ కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం మహేష్ బాబు మురగదాస్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం కంప్లీట్ అవ్వగానే.. కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు.

ఇంక కొన్ని రోజుల్లోమహేష్ బాబు తన అప్ కమింగ్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మురుగదాస్ సినిమా పూర్తయిన వెంటనే.. కొరటాల శివ సినిమాకి మహేష్‌ బాబు పని చేయనున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దీనికి సంబంధించిన కథపై కసరత్తు చేస్తున్నాడు. ‘శ్రీమంతుడు’ వంటి ఘన విజయం తరువాత కొరటాల శివ మళ్ళీ ఓ సోషియల్‌ మెసేజ్ తరహా సబ్జెక్ట్ ని రెడీ చేస్తున్నాడు. అయితే కొరటాల శివ రెడీ చేస్తున్న సబ్జెక్ట్‌ లీక్‌ అయినట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… కొరటాల శివ రెడీ చేస్తున్న కొత్త సబ్జెక్ట్ అనేది కొద్దిగా పొలిటికల్‌ టచ్‌ లో ఉండనుందని అంటున్నారు. తాజాగా పొలిటికల్‌ లీడర్స్ కి సంబంధించిన లైఫ్‌ స్టైల్… కొంత మంది జీవిత కథలను కొరటాల శివ తెలుసుకుంటున్నారట. అంతే కాకుండా బ్లాక్ మనీతో రూరల్‌ ప్రాంతాలను ఏ విధంగా రాజకీయనాయకులు ఆధీనంలోకి తీసుకుంటారు? వంటి విషయాలపై కొరటాల శివ ఆసక్తి చూపుతున్నారని ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం. మొత్తంగా మహేష్, కొరటాల సినిమా కథ బయటకు రావడంతో ఈ కథపై ఫ్యాన్స్ లోనూ ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు.

Related

  1. రష్మీకి అన్యాయం చేసిన మహేష్ బాబు!
  2. మహేష్ సిగరెట్ మానడానికి కారణం ఎవరో తెలుసా?
  3. మహేష్ బాబు భార్య లైఫ్ సీక్రెట్స్
  4. మహేష్ బాబుని ఇంప్రెస్ చేసిన కీర్తి సురేష్‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -