Tuesday, May 21, 2024
- Advertisement -

మహేష్ బాబుని ఇంప్రెస్ చేసిన కీర్తి సురేష్‌!

- Advertisement -
keerthi suresh in mahesh film

సూపర్ స్టార్ మహేష్ బాబు, వరస విజయలతో మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు సినిమా తర్వాత మరో సినిమా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మహేష్ బాబు ఏఆర్‌.మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న (వ‌ర్కింగ్ టైటిల్ ఏజెంట్ శివ‌) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రం షూటింగ్ వ‌చ్చే మార్చి నాటికి పూర్తి కానుంది. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే మ‌హేష్ కొరటాల డైరెక్ష‌న్‌లో తెరకెక్కనున్న చిత్ర  షూటింగ్ లో పాల్గొననున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రంకు సంబంధించి  ప్రీ ప్రొడక్షన్ వర్క్, నటీనటుల ఎంపిక జరుగుతోంది. శ్రీమంతుడు సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మహేష్ అభిమానులో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసమ్ పలువరి పేర్లు పరిశీలించిన ద‌ర్శ‌కుడు శివ‌, మ‌హేష్ చివ‌ర‌కు నేను శైలజ సినిమాతో తెలుగులోకి పరిచయం అయిన కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారన్న టాక్ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం కీర్తి తెలుగు, తమిళ భాషల్లో వరస సినిమాలతో బిజీగా ఉంది. అయితే సూపర్ స్టార్ మహేష్ పక్కనా చాన్స్ రావడంతో వెంటనే ఒప్పేసుకుందట. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘రెమో’ చిత్రంలో కీర్తి సురేష్‌ నటన మహేష్ ను బాగా ఇంప్రెస్ చేసింద‌ట‌. దీంతో మ‌హేష్ పట్టుబట్టి మ‌రీ కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా తీసుకోవాల‌ని.. ఆమె పేరునే కొరటాల శివ సూచించిన‌ట్టు తెలుస్తోంది.

Related

  1. క‌మెడియ‌న్‌ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్
  2. కాలేజ్ అబ్బాయి ప్రేమలో కీర్తి
  3. మహేష్ బాబు ఆస్తి ఎంతో తెలుసా?
  4. 2,500 మంది పిల్లలకు దీపావళి కానుకగా గిఫ్ట్‌ బాక్స్‌లు పంపిన సూపర్‌స్టార్‌ మహేష్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -