Saturday, May 18, 2024
- Advertisement -

ప‌రిటాల సునీత పాత్ర‌లో మెర‌వ‌నున్న ర‌మ్య‌కృష్ణ‌…

- Advertisement -

ప్ర‌స్తుతం సినిమాల‌ల్లో లైవ్ క్యారెక్ట‌ర్ల హ‌వా న‌డుస్తోంది. ప్ర‌ధానంగా చెప్ప‌పుకోవాల్సింది లైవ్ క్యారెక్ట‌ర్ల‌లో ర‌మ్య‌కృష్ణ‌. బాహుబ‌ళి 1,2 సినిమాలో ర‌మ్య‌కృష్ణ ఎలాంటి ప‌వ‌ర్‌పుల్ రోల్ చేసిందే తెలిసిందే. ఇప్పుడు అదే త‌ర‌హాలో మ‌రో క్యారెక్ట‌ర్‌లో మెర‌వ‌నుంది. అలాంటి ఇలాంటి పాత్రలో కాదండోయ్ ప్రస్తుత మంత్రి పరిటాల సునీత పాత్రలో కనిపించబోతోందని వార్త‌లు హ‌ల్ చేస్తున్నాయి.

అయితె బ‌యోపిక్ సినిమాలో కాదు. రాయలసీమ తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి క్యారెక్టర్ ను స్ఫూర్తిగా తీసుకుని, అల్లుకున్న ఓ కథలో రమ్యకృష్ణ అతని భార్య పాత్ర పోషిస్తోంది. హీరో నారా రోహిత్ బాలకృష్ణుడు అనే సినిమా చేస్తున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ వ్యవహారాల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. ఈ కథ దాదాపుగా పరిటాల రవి కథలా వుంటుందని తెలుస్తోంది.

ముఖ్యంగా సినిమాలో పరిటాల రవిని కిడ్నాప్ చేస్తే, ఆయన భార్యగా సునీత ఎలా స్పందించి, ఎలా పోరాడారన్నది, అసలు పరిటాల రవి లాంటి క్యారెక్టర్ ను ఎందుకు కిడ్నాప్ చేసారన్నది మరో పాయింట్ అని తెలుస్తోంది. ఇంతకీ కిడ్నాపర్ గా హీరో నారా రోహిత్ నే చేయడం విశేషం. పక్కా ఫిక్షన్ అయినా, సినిమా చూస్తే పరిటాల ఫ్యామిలీ గుర్తుకువస్తుందని అంటున్నారు. రమ్యకృష్ణకు మరో పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో ప్రేక్ష‌కుల‌ను క‌నువిందు చేయ‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -