Monday, May 6, 2024
- Advertisement -

రోబో- 2లో ఐష్

- Advertisement -

ఐశ్వర్యారాయ్ వ‌య‌స్సు పెరుగుతున్న అందం త‌గ్గ‌ని హీరోయిన్.మొన్న‌టికి మొన్న అంబానీ ఇంట్లో జరిగిన కార్య‌క్ర‌మంలో క్లీవెజ్ షోతో త‌నలోని గ్లామ‌ర్ ఇంకా త‌గ్గ‌లేద‌ని నిరుపించుకుంది.ఇప్పుడు ఐశ్వర్యారాయ్‌కి సంబంధించిన వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.రోబో సినిమాలో ర‌జ‌నీకాంత్ ప‌క్క‌న హీరోయిన్‌గా ఐశ్వర్యారాయ్ చేసిన సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే.కాని రోబో 2 లో ఐశ్వర్యారాయ్ కాద‌ని ఎమీజాక్సన్ హీరోయిన్‌గా తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు శంక‌ర్‌.అప్పుడు అంద‌రు ఐశ్వర్యారాయ్ అయితే చాలా బాగుంటుద‌ని అనే కామెంట్స్ చేశారు.

అప్పుడు ఐశ్వర్యారాయ్ కూడా పెద్ద‌గా సినిమాలు చెయ్య‌డం లేదు.ఇప్పుడు శంక‌ర్ ఆ లోటుని భ‌ర్తీ చేయ‌డానికి ఐశ్వర్యారాయ్‌ని రోబో 2 తీసుకున్నాడ‌ని తెలుస్తుంది.ఓ చిన్న క్యారెక్ట‌ర్‌లో ఐష్ కనిపిస్తుంద‌ని స‌మాచారం.ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీత బాణీలు కడుతున్న ఈ చిత్రాన్ని సుమారు రూ.450 కోట్ల వ్యయంతో లైకా సంస్థ నిర్మిస్తోంది. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా గ్రాఫిక్స్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -