Monday, April 29, 2024
- Advertisement -

వైర‌ల్ అవుతోన్న కోహ్లీ, మెక్ కల్లమ్, చాహల్ డాన్స్ వీడియో ….

- Advertisement -

ఐపీఎల్‌కు మరో మూడు రోజులే ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా క్రికెట్ సందడే. ప్లేయర్స్‌ కూడా అటు నెట్ ప్రాక్టీస్… ఇటు షూట్స్‌లో బిజీ అయ్యారు. కేవలం ఆటతోనే సరిపెట్టకుండా స్టెప్పులేసి మరీ అభిమానులను ఆకట్టుకోవడానికి రాయల్‌ చాలెంజర్స్‌(ఆర్సీబీ) బెంగుళూరు ఆటగాళ్లు సిద్ధమయ్యారు.

ఆర్సీబీ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు ఆటగాళ్లు యజువేంద్ర చాహల్, బ్రెండన్‌ మెకల్లమ్‌ చిందులేశారు. ‘ఐపీఎల్‌ కోసం లెజెండ్స్‌తో వార్మప్‌ మొదలెట్టేశా’ అంటూ కోహ్లి, మెక్‌కల్లమ్‌ను ట్యాగ్‌ చేస్తూ 12 సెకన్ల నిడివి ఉన్న డాన్స్‌ వీడియోను చాహల్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు.

బ్యాటు, బంతితో చెలరేగే ఆటగాళ్లను మ్యూజిక్‌ కు అనుగుణంగా స్టెప్పులేయించడంతో సమన్వయం కుదురలేదు. దీంతో నవ్వు ఆపుకోలేక చాహల్ నవ్వేశాడు. దీంతో కోహ్లీ కూడా నవ్వేశాడు. దీనికి సంబంధించిన వీడియోను చాహల్‌ తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దీనికి ‘ఐపీఎల్‌ కోసం దిగ్గజ ఆటగాళ్లు కోహ్లీ, మెక్ కల్లమ్‌ తో వార్మప్‌ చేస్తున్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది ఇప్పుడు ఆ వీడియో వైర‌ల్ అవుతోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -