Saturday, May 11, 2024
- Advertisement -

ఐశ్వర్యరాయ్ బ‌యోపిక్‌కు రంగం సిద్ధం?

- Advertisement -

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌రకు ప్ర‌తి ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్‌ల హ‌డావిడి న‌డుస్తుంది. తెలుగులో ఎన్టీఆర్, వైఎస్సార్ జీవిత కథలతో సినిమాలు రూపొందుతున్నాయి. తమిళంలో జయలలిత, ఎంజిఆర్ ల బయోపిక్ లను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక బాలీవుడ్‌లో ధోనీ, సంజయ్ దత్,సిల్క్ స్మిత‌ జీవితాల ఆధారంగా రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేసుకున్నాయి.

తాజాగా బాలీవుడ్‌లో మ‌రో స్టార్ హీరోయిన్ బ‌యోపిక్‌కు రంగం సిద్ధం అవుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ జీవిత కథతో సినిమా తీయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క- నిర్మాత‌లు. ఐశ్వర్యరాయ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి మిస్ వరల్డ్ గా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఆమె ఎదిగిన క్రమం, అభిషేక్ తో పెళ్లి.. దానికి ముందు పలు వివాదాలు, హీరోలతో ఎఫైర్లు ఇలా ఆమె జీవితంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌ల‌తో సినిమా క‌థ‌ను రెడీ చేసే పనిలో ప‌డ్డారటా. ఈ విషయంపై స్పందించిన ఐశ్వర్య.. ‘నా జీవిత కథతో సినిమా రూపొందాలని నేను కూడా కోరుకుంటున్నాను. నా జీవితంలో ఉన్న అన్ని కోణాలు ప్రజలకు తెలియాలి. ఏది దాచాలని అనుకోవడం లేదని తెలిపింది. మ‌రి ఐశ్వర్యరాయ్ జీవిత క‌థ‌ను ఎవ‌రు తెర‌కెక్కిస్తారో, అందులో ఎవ‌రు న‌టిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -