Saturday, May 18, 2024
- Advertisement -

నూత‌న్ నాయుడు కోసం హాస్పిటల్‌కు వెళ్లిన కౌశ‌ల్ అభిమానులు..!

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో మొద‌టి నుంచి హౌస్‌మెట్స్ అంద‌రు ఒక‌వైపు,కౌశ‌ల్ ఒక్క‌డే ఒక‌వైపు అన్న‌ట్లుగా సాగుతుంది. కౌశ‌ల్ నిజాయితి,ప‌ట్టుద‌ల‌ను చూసి బ‌య‌ట ఆయ‌న‌కు విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇక అతినికి మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో కౌశ‌ల్ ఆర్మీ పేర‌ట ఓ గ్రూప్ ఏర్ప‌డింది. కౌశ‌ల్‌తో గొడ‌వప‌డే ప్ర‌తి ఒక్క‌రిని బిగ్బాస్ హౌస్ నుంచి బ‌య‌టికి పంపిచేస్తున్నారు ఈ కౌశ‌ల్ ఆర్మీ గ్రూప్‌.

నూతన్ నాయుడు హౌస్ లో ఉన్న రెండు వారాలు కౌశల్ ని సపోర్ట్ చేస్తూ సన్నిహితంగా ఉన్నారు. ఆయన బయటకి వెళ్లిపోయిన తరువాత కౌశల్ మళ్లీ ఒంటరి వాడైపోయాడు. రీసెంట్ గా నూతన్ నాయుడు హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. అప్పటినుండి కౌశల్, నూతన్ ఒక్కటిగా ఉంటున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో నూతన్ భుజనాయికి గాయం కావడంతో అతడిని హౌస్ నుండి బయటకి పంపేయాల్సిన పరిస్థితి కలిగింది. ట్రీట్మెంట్ కోసం నూతన్ ని హాస్పిటల్ లో చేర్చారు. ఈ విషయం తెలిసిన కొందరు కౌశల్ అభిమానులు నూతన్ ని పరామర్శించడానికి వెళ్లగా నూతన్ వారితో కౌశల్ గురించే మాట్లాడారట. బిగ్‌బాస్ హౌస్ ఉన్న వారంద‌రికి కౌశ‌ల్ అంటే ప‌డ‌దు,కౌశల్ ని తలచుకుంటేనే బాధగా ఉంది. నిన్నటి టాస్క్ లో చూశారు కదా.. అందరూ కౌశల్ ని ఎలా టార్గెట్ చేశారు. నేను మ‌ళ్లీ తిరిగి హౌస్‌కి వెళ్లితే అత‌నికే స‌పోర్టు చేస్తానని కౌశ‌ల్ ఆర్మీకి మాటిచ్చాడ‌టా నూత‌న్ నాయుడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -