Wednesday, May 22, 2024
- Advertisement -

బిగ్‌బాస్ రాజ‌కీయ‌ల‌పై స్పందించిన సంజ‌న‌

- Advertisement -

కొంత‌కాలంక్రితం కాస్టింగ్ కౌచ్ తెలుగు ఇండ‌స్ట్రీని కుదిపేసిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే. శ్రీరెడ్డి టాలీవుడ్‌పై చేసిన కామెంట్స్‌తో అందరినీ బజారుకీడ్చింది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు కొందరు కాస్టింగ్ కౌచ్ ఉందన్నారు, కొందరు లేదన్నారు. తాజాగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ సంజన అన్నె బిగ్‌బాస్‌ లో కాస్టింగ్ కౌచ్ ఉందా అన్నదానిపై స్పందించారు.

సంజన అన్నె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘బిగ్‌బాస్‌ లో కాస్టింగ్ కౌచ్ లేదు. ఎవరైతే నిర్వహిస్తున్నారో వారంతా గోల్డ్.. బంగారం లాంటి వారు.. కాస్టింగ్ కౌచ్ లేదు కానీ అందులో రాజకీయాలు మాత్రం ఉన్నాయి. అందుకే తొలివారమే నన్ను జైల్లో పెట్టి ఎలిమినేట్ అయ్యేలా చేశారు’ అని ఆరోపించారు. బిగ్‌బాస్‌ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంట్ సంజన అన్నె. ఇక బ‌య‌టికి వ‌చ్చిన సంజ‌న నాని యాంక‌రింగ్‌పై కొన్ని విమ‌ర్శ‌లు చేసి సంచ‌ల‌నం రేపింది. ఇప్పుడు మ‌ళ్లీ బిగ్‌బాస్‌పై కామెంట్స్ చేసి వార్త‌ల్లో నిలిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -