Saturday, May 11, 2024
- Advertisement -

సాగర కన్యగా ఐష్!

- Advertisement -

ఐశ్వర్యా రాయ్ పెళ్లి అయి ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన త‌న అందం ఏమాత్రం త‌గ్గ‌లేదు.ఇంకా చెప్పాలంటే రోజు రోజుకి త‌న అందం పెరుగుతుంది.పాతికేళ్ల క్రితం ప్రపంచ సుందరి కిరీటాన్ని శిగలో తురుముకున్న ఈ అందాల రాశి సౌందర్యం ఇప్పటికీ చెక్కు చెదరలేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐష్ తన అందంతో మ‌తి పొగొట్టింది.సాగర కన్య తరహాలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా డిజైన్ చేసిన డ్రెస్ తో రెడ్ కార్పెట్ పై ఐశ్వర్యా రాయ్ మెరిసిపోయింది.

రెడ్ కార్పెట్ పై ఐష్ నడిచివస్తున్నంత సేపు అక్కడున్నవారంతా చూపు తిప్పుకోలేదు. 2018 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్యా రాయ్ సందడి చేసింది. 44 ఏళ్ల వయసులో కూడా ఐష్….కళ్లు మిరిమిట్లుగొలిపే సొగసుతో చూపరులను కట్టిపడేస్తోంది. ప్రఖ్యాత డిజైనర్ మైఖేల్ డిజైన్ చేసిన ఊదా నలుపు వర్ణం డ్రెస్ లో ఐష్ తళుక్కున మెరిసింది.బాలీవుడ్ మ‌రో భామ దీపిక ప‌దుకునే కూడా 2018 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -