Wednesday, April 24, 2024
- Advertisement -

భార్య ఫోన్ నెంబ‌ర్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన స్టార్ హీరో..!

- Advertisement -

బాలీవుడ్‌లో బెస్ట్ క‌పూల్ అంటే అజయ్ దేవగన్ – కాజోల్ పేర్లే చెబుతారు చాలామంది. వీరిద్ద‌రి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.పెళ్లి త‌రువాత కూడా కాజోల్ సినిమాలు చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు అజ‌య్ దేవ‌గ‌న్.వీరి ప్రేమ‌ను చూసి చాలా మంది మురిసిపోతుంటారు.తాజాగా అజ‌య్ దేవ‌గ‌న్ చేసిన ప‌నితో బాలీవుడ్ మొత్తం షాక్ అయింది,భార్య కాజోల్ ఫోన్ నెంబ‌ర్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.మొద‌ట అజ‌య్ దేవ‌గ‌న్ అలా ఎందుకు చేశాడో ఎవ‌రికి అర్థం కాలేదు. అభిమానులు ఆమెకి మెసేజ్ పెట్టి ఆ స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తూ.. ‘రిప్లయ్ కోసం ఎదురుచూస్తున్నాం సార్’ అంటూ అజయ్ దేవగన్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఆ నంబర్ కి ఫోన్ చేస్తే.. కాల్ ఫార్వార్డ్ అని వచ్చిందని కొందరు.. వాట్సాప్ లో పలకరిస్తే ఆమె మెసేజ్ రిసీవ్ చేసుకోలేదని మరికొందరు పోస్ట్ లు పెడుతున్నారు. మరొకొందరితే ‘నేను కాల్ చేశాను అయితే కాజోల్ మాట్లాడను, వాట్సాప్ చేస్తానందని ఫోజులు కొడుతున్నారు.మ‌రి కొంద‌రు కాజోల్‌కు స‌ల‌హాలు ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు.అజ‌య్‌గారు మీ నెంబ‌ర్ ట్వీట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు,ద‌య‌చేసి మీ నెంబ‌ర్‌ను జాగ్ర‌త్త‌గా వాడండి అంటూ కాజోల్‌కు స‌ల‌హాలు ఇచ్చారు.తాజాగా ఈ సంఘ‌ట‌న పై వివ‌ర‌ణ ఇచ్చాడు అజ‌య్ దేవ‌గ‌న్‌.మిమ్మ‌ల్ని స‌రాదాగా ఆట ప‌ట్టించాను బ్రో అంటు త‌న ట్వీట్ట‌ర్ ద్వారా తెలిపాడు అజ‌య్ దేవ‌గ‌న్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -