Monday, May 20, 2024
- Advertisement -

బాబుకు షాక్‌…అవినీతిపై ప్ర‌జావ్యాజ్యాన్ని స్వీక‌రించిన హైకోర్టు..తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ‌..?

- Advertisement -

నేను నిజాయితీ ప‌రున్న అని డ‌బ్బా కొట్టుకొనే చంద్ర‌బాబుకు భారీ షాక్ త‌గ‌ల‌నుందా..? గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో జ‌రిగిన తండ్రి, కొడుకులు చేసిన అవినీతిపై విచార‌ణ జ‌రిగే అవ‌కాశ ముందా…? ప‌రిణామాలు చూస్తుంటే అవున‌నే అంటున్నాయి. ఒక వైపు కేంద్రం ఏదో చేస్తాద‌ని బాబు అండ్ కోలో ఇప్ప‌టికే భ‌యం ప‌ట్టుకుంది. ఇదిలా ఉంటే మ‌రో వైపు బాబుకు బిగ్‌షాక్ త‌గిలింది. ఆయన ఆస్తులపీ విచారణ కోరుతూ దాఖలైన ప్రజావ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది.

తండ్రి, కొడుకుల‌పై ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా వ్యాజ్యాన్ని హైకోర్టు స్వీకరించడం విశేష పరిణానమే. బాబు, లోకేష్, వేమూరి రవి కుమార్ లు డొల్ల కంపెనీలకు అనుమతులు ఇచ్చారని, వాటి ద్వారా పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని ఈ పిల్ లో పేర్కొన్నారు. ప్రజా వ్యాజ్యం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందుకు ఈ రోజే విచారణకు రానుందని చెబుతున్నారు.

అక్రమాలపై సీబీఐ, ఈడీ సంస్థలతో విచారణ జరిపించాలని ముందడుగు ప్రజా పార్టీ వ్యవస్థాపక‌ అధ్యక్షుడు, మాజీ న్యాయమూర్తి కె శ్రావణ్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో ఐటీరంగం అభివృద్ధి, నూతన కంపెనీల ఏర్పాటు, నిరుద్యోగ యువతకు నైపుణ్యశిక్షణ, ఉపాధి కల్పన, పరిశ్రమల పేరిట వేల ఎకరాలను ధారాదత్తం చేసి చంద్రబాబు, లోకేశ్ సుమారు రూ.25 వేల కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టారంటూ ఫిల్‌లో పేర్కొన్నారు.తివాదులుగా చంద్రబాబునాయుడు, లోకేశ్, ఏపీఎన్నార్టీ సొసైటీ చైర్మన్ వేమూరి రవికుమార్, పల్లె రఘునాథ్‌రెడ్డి తదితరులను పేర్కొన్నారు.

లోకేశ్ ఐటీశాఖ మంత్రి అయిన తర్వాత తమ సమీప బంధువు వేమూరి రవికుమార్‌ను ఐటీశాఖ ముఖ్య సలహాదారుగా, ఏపీఎన్నార్టీ చైర్మన్‌గా నియమించారని పిటిషనర్ పేర్కొన్నారు.వివిధ కంపెనీలకు కేటాయించిన 57,836 ఎకరాల భూముల్లో జరిగిన కొన్ని అక్రమాలను పిటిషన్‌లో వివరించారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ, ఇన్నోవా సొల్యూషన్స్‌కు ఏడేండ్లలో 2,500 మందికి ఉద్యోగాలు కల్పించాలనే షరతుపై విశాఖపట్టణంలోని సుమారు రూ.500 కోట్ల విలువజేసే 40 ఎకరాల భూమిని నామామాత్రపు ధరకే కేటాయించడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు.

కనీసం ఆర్టీఐ కింద దరఖాస్తు చేసినా సమాచారం ఇవ్వలేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కొత్తగా స్థాపించే ఐటీ కంపెనీల్లో ఏపీకి చెందిన యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ పేరిట ఒక్కొక్కరికి రూ.లక్ష ఖర్చు చేస్తున్నట్టుగా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తున్నదని.. ఈ మొత్తం వ్యవహారాల్లో చంద్రబాబు, లోకేశ్ భారీగా అక్రమార్జనకు పాల్పడతున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా ఈ పిల్ విషయంలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రాలలో, రాజకీయ వర్గాలలో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -