Monday, April 29, 2024
- Advertisement -

ఎన్నికల్లో నేరస్థుల అన‌ర్హ‌త‌పై చేతులెత్తేసిన సుప్రీం కోర్టు…

- Advertisement -

వచ్చే నెల 2న పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, కొద్దిసేపటి క్రితం కీలక కేసులో తీర్పును వెలువరించారు. క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులు వారిపై అభియోగాల దశలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించే అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

నేరారోపణలు, ఆర్థిక నేరాభియోగాలు నమోదైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించే అంశంలో తాము ఎటువంటి ఆదేశాలనూ ఇవ్వలేమని, అభ్యర్థుల అనర్హతపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

నేతల అవినీతి జాతీయ ఆర్థిక ఉగ్రవాదమేనని అభిప్రాయపడ్డ ధర్మాసనం, ఈ విషయంలో పార్లమెంటులో కఠిన చట్టాలను తేవాల్సివుందని పేర్కొంది. రాజ్యాంగ సవరణ, కొత్త చట్టాలు తెస్తేనే, నేర చరితులను రాజకీయాలకు, ఎన్నికలకు దూరంగా పెట్టవచ్చని తెలిపింది.

జాప్రాతినిథ్య చట్టం కింద ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో వారు దోషులుగా తేలితేనే పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటిస్తున్నారు. ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆగస్ట్ 28న తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -