Friday, April 26, 2024
- Advertisement -

మళ్లీ తెరపై చిరు విశ్వరూపం

- Advertisement -

వరుస సినిమాలతో చిరంజీవి ప్రస్తుతం బీజీబీజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో మెగా స్టార్ గాడ్ ఫాదర్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఇక యువ దర్శకులతో మరిన్ని సినిమాలకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు వేగంగా సాగుతున్నాయి.

ఓ పవర్ పుల్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఇంద్ర తర్వాత మళ్లీ అలాంటి పవర్ ఫుల్ పాత్ర చిరంజీవి చేయడలేదు. లీడర్ గా ఆ చిత్రంలో చిరు నట విశ్వరూపం చూపించారు. దర్శకులు కూడా తర్వాత మళ్లీ అలాంటి కథతో ఆయన దగ్గరకు రాలేదు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇలాంటి కథతోనే చిరును చూపించబోతున్నారట యువ దర్శకుడు వెంకీ కుడుముల. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర గంభీరంగా సాగుతుందని సమాచారం. అంతేకాదు చక్కటి నవ్వులు పంచుతుందని టాలీవుడ్‌ టాక్‌. వెంకీ చిరు పాత్రను అలా డిజైన్‌ చేశారట.

ఆ వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరోవైపు మెహర్‌ రమేశ్‌ ‘భోళాశంకర్’, బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండూ ఒక కొలిక్కి వచ్చాక, వెంకీ కుడుముల చిత్రం పట్టాలెక్కనుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -