Sunday, May 5, 2024
- Advertisement -

విడుదలకు ముందే వాలిమై రికార్డుల హోరు..!

- Advertisement -

తమిళ అగ్రనటుడు అజిత్​ హీరోగా వాలిమై అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే రికార్డుల మోత మోగిస్తున్నది. మరోవైపు ఈ సినిమా కోసం అజిత్​ ఫ్యాన్స్​ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బుక్​మై షో యాప్​లో ఈ చిత్రం ఇప్పటికే రికార్డులు క్రియేట్​ చేసింది. 1 మిలియన్​ ఇంట్రెస్ట్​లు సాధించింది. దీంతో ఫ్యాన్స్​ ఖుషీ అవుతున్నారు. అయితే అజిత్​ ఫ్యాన్స్​ రికార్డులు సృష్టించాలన్న ఉద్దేశ్యంతో ఈ రికార్డును క్రియేట్​ చేసినట్టు టాక్​.

గతంలో ఈ రికార్డు బాహుబలి -2 పేరు మీద ఉన్నది. అయితే బాహుబలి- 2 విడుదలయ్యాక.. 1 మిలియన్​ వ్యూస్​ సాధించింది. ఇప్పుడు వాలిమై విడుదలకు ముందే ఈ రికార్డును క్రియేట్​ చేయడం గమనార్హం.వాలిమై చిత్రానికి విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ కావడంతో ఫ్యాన్స్​ పండగ చేసుకుంటున్నారు. హుమా ఖురేషి, కార్తికేయ గుమ్మకొండ, యోగి బాబు, సుమిత్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. దాదాపు గత రెండేళ్లుగా వాలిమై’ అప్డేట్ గురించి ఎదురు చూస్తున్నారు అజిత్ అభిమానులు.

ఈ ఏడాది మే 1న అజిత్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘వాలిమై’ ఫస్ట్ లుక్ విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చిత్ర ప్రమోషన్లను వాయిదా వేశారు మేకర్స్. ‘వాలిమై’ ఫస్ట్ లుక్ పోస్టర్, విడుదల తేదీని వచ్చే నెలలో ప్రకటించనున్నట్లు సమాచారం. యువన్​ శంకర్​రాజా ఈ మూవీకి మ్యూజిక్​ అందిస్తున్నాడు.

Also Read : చిన్నోడు, పెద్దోడు.. వీళ్ల అసలు పేర్లు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -