చిన్నోడు, పెద్దోడు.. వీళ్ల అసలు పేర్లు ఇవే..!

- Advertisement -

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. శ్రీకాంత్​ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రంలో వెంకటేశ్​, మహేశ్​బాబు, ప్రకాశ్​రాజ్, జయసుధ, అంజలి, సమంత నటించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి సినిమాగా సీతమ్మవాకిట్లో.. పేరు తెచ్చుకుంది. అందుకు తగ్గట్టే ఫ్యామిలీస్ ఈ సినిమాను ఆదరించారు. తెలుగులో మల్టీ స్టారర్​ చిత్రాలకు ఈ మూవీ మళ్లీ ప్రాణం పోసింది. 2013వ సంవత్సరం జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక సినిమాలో నటించిన వారందరూ ఎవరిస్థాయిలో వారు అద్భుతంగా నటించారు. ఇప్పటికీ మీమ్స్​లో ఈ మూవీ స్టిల్స్​ వాడతారంటే .. ఈ చిత్రం ఎంత ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో గొప్ప కుటుంబకథా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో మహేశ్​బాబును చిన్నోడు.. అని వెంకటేశ్​ ను పెద్దోడు అని పిలుస్తుంటారు. వాళ్ల అసలు పేర్లు ఏమిటో ఈ సినిమాలో చూపించలేదు. అయితే ప్రస్తుతం నెటిజన్లు వాళ్ల అసలు పేర్లను కనిపెట్టారు.

ఈ సినిమాలో వెంకటేష్ పేరు మల్లికార్జున రావు.. మహేష్ బాబు పేరు సీతారామ రాజు అని తేలింది. ఇది నిజమో కాదో తెలీదు.. సినిమా డిస్కషన్స్​ టైంలో ఈ పేర్లు అనుకున్నారు. ఇందుకు సంబంధించి గూగుల్ ఈ సినిమా వివరాల్లో వెంకీ, మహేష్ సినిమాలోని పాత్రల పేర్లు వెల్లడించారు. అయితే ఆ తర్వాత ఆ వివరాలను డిలీట్ చేశారు. కాగా ఆ వివరాలు డిలీట్ చేయకముందే వెంకీ మహేష్ పేర్ల వివరాలతో కూడిన స్క్రీన్ షాట్ లు మాత్రం బయటకు వచ్చాయి. అవి ప్రస్తుతం వైరల్​ గా మారాయి. అయితే ఏ విషయాన్ని అయినా సంచలనం చేయడం సోషల్ మీడియాలో కామన్​. ప్రస్తుతం పెద్దోడు, చిన్నోడు కాదు.. వాళ్ల అసలు పేర్లు ఇవేనంటూ మీమర్స్​, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read

పవన్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న హరీష్ శంకర్..!

పవన్​కల్యాణ్​కు బండ్ల గణేశ్​ పెట్టిన పేరు ఇదే..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -