బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్. కొద్దిరోజులుగా అఖండ 2 రిలీజ్‌పై సందిగ్దం నెలకొనగా తాజాగా క్లారిటీ వచ్చేసింది. దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించిన ఈ సినిమా అసలుగా డిసెంబర్ 5, 2025న విడుదల కావాల్సి ఉన్నా, ఆర్థిక సమస్యల కారణంగా తేదీని మార్చాల్సి వచ్చింది.
ఈ శుక్రవారం, డిసెంబర్ 12, 2025న అనేక సినిమాలు విడుదలకు సిద్దమయ్యాయి. వాటిలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో రూపొందిన మోగ్లీ 2025, బన్నీవాస్ సమర్పణలో వచ్చిన హారర్ థ్రిల్లర్ ఈషా, కార్తీ నటించిన అన్నగారు వస్తారు వంటి చిత్రాలు ఉన్నాయి.
ఇండస్ట్రీ మూవ్‌మెంట్‌ను చూస్తే, అఖండ 2 డిసెంబర్ 12, 2025న థియేటర్లలో విడుదల కావడం దాదాపు ఖాయమే. అధికారిక ప్రకటన ఈ సాయంత్రం వచ్చే అవకాశం ఉంది. బాలయ్య అభిమానులు, సినీప్రేమికులు ఆ కన్ఫర్మేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
