- Advertisement -

నెహ్రూపై మోదీ వ్యాఖ్యలు..షర్మిల ఆగ్రహం

- Advertisement -

దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం అని మండిపడ్డారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల. స్వాతంత్ర్య ఉద్యమాన్ని, సమరయోధులను, దేశ చరిత్రను తీవ్రంగా అవమానించినట్లే…ఈ దేశానికి నెహ్రూ అసలైన విశ్వాస పాత్రుడైతే, ప్రధాని మోదీ సిసలైన విశ్వాస ఘతకుడు
అన్నారు.

లౌకిక ప్రజాస్వామ్యాన్ని దెబ్బకొడుతునట్లే. ప్రధాని హోదాలో పార్లమెంట్ సాక్షిగా మత విద్వేషాలను రెచ్చగొట్టినట్లే. స్వాతంత్ర్యం కోసం 12 ఏళ్లు జైలు శిక్ష భరించిన నెహ్రూ గారి మీద, సిద్ధించిన స్వాతంత్ర్యంలో 12 ఏళ్లుగా పదవిలో ఉంటూ రాజభోగం అనుభవిస్తున్న మోడీ గారు మాట్లాడడం సిగ్గుచేటు. మోడీ గారి మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించడంతో సమానం. బ్రిటీష్ పాలన అంతానికి జరిగిన స్వాతంత్ర్య ఉద్యమంలో బిజెపి పూర్వీకులు ఎక్కడ ? మత ఛాందస వాదులు ఏనాడైనా వందేమాతరం ఉచ్చరించారా ? కనీసం ఎప్పుడైనా జాతీయ పతాకానికి RSS సెల్యూట్ కొట్టిందా ? 2002 వరకు RSS కేంద్ర కార్యాలయంపై మూడు రంగుల జెండా ఎగిరిందా ? చెప్పాలన్నారు.

బెంగాల్ ఎన్నికల కోసం ప్రజల మధ్య మరోసారి విభజన తెచ్చేందుకు, విచ్ఛిన్నకర శక్తులను ఉసిగొల్పేందుకు జాతీయ గీతాన్ని వాడుకుంటున్నారు. స్వాతంత్ర్యోద్యమ చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తున్నారు. వ్యవస్థల మీద బీజేపీ అజమాయిషీ చర్చ రాకుండా నెహ్రూజీని దోషిగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారు. విభజించు – పాలించు సిద్ధాంతాలను మళ్లీ ఆచరిస్తున్న మోడీ గారు మరో అభినవ బ్రిటీషర్ . జాతీయగీతాన్ని, వందేమాతర స్ఫూర్తిని ఈ దేశంలో నిలబెట్టింది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు షర్మిల.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -