పాన్ ఇండియా స్టార్ యష్ హీరోగా నటిస్తున్న చిత్రం టాక్సిక్. కొద్దిరోజులుగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇందుకు సంబంధించి అధికారిక పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
సినిమా రిలీజ్‌కి ఇంకా 100 రోజులు మాత్రమే మిగిలున్నాయి అని పోస్టర్ ద్వారా పేర్కొనగా మొత్తంగా మార్చి 19, 2026 న విడుదల కానుందని ధృవీకరించారు. దర్శకురాలు గీతు మొహందాస్, యష్ మరియు మొత్తం టీమ్ సినిమా నిర్ణయించిన తేదీకే వస్తుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
టాక్సిక్ చిత్రంలో రుక్మిణి వసంత్, కియారా అద్వాణి, నయనతార, హూమా ఖురేషీ, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకట్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతోంది. మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి.
