అక్కినేని నట వారసుడి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అఖిల్. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు ఇతనిపై చాలా అంచనాలు ఉన్నాయి. దానికి తగినట్లుగానే అఖిల్ మొదటి సినిమాను మాస్ దర్శకుడు వివి వినాయక్‌తో ప్లాన్ చేశాడు నాగర్జున. తన పేరునే మొదట సినిమా పేరుగా పెట్టుకున్న అఖిల్‌కు ఈ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. అఖిల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. మొదటి సినిమా ఇచ్చిన షాక్‌తో రెండో సినిమా చేయడానికి చాలా సమయమే తీసుకున్నాడు అఖిల్. తమ ఫ్యామిలీకి మనం వంటి హిట్ ఇచ్చిన దర్శకుడితో రెండో సినిమా హలో చేశాడు. ఈ సినిమా కూడా ఫెయిల్ అయింది. ఇటీవలే అఖిల్ నటించిన మజ్ను సినిమా కూడా ఫ్లాప్‌గా నిలిచింది. అఖిల్‌కు కోసం నాగ్ చేయని ప్రయత్న లేదు. తాజాగా మరోసారి అఖిల్ కోసం స్టార్ ప్రొడ్యుసర్‌ను రంగంలోకి దించాడు నాగ్. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌తో అఖిల్ నాలుగో సినిమాను ప్లాన్ చేశాడు నాగ్. నాగ్ అడగడంతోనే అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.మీడియా బడ్జెట్ లో మంచి డైరక్టర్‌తో ఓ మ్యూజికల్ ఎంటర్టైనర్ చేసి హిట్ కొడదామని నాగ్‌కు అల్లు అరవింద్ హామీ ఇచ్చారట. అఖిల్ కోసం ఇద్దరి దర్శకులను రంగంలోకి దించాడు అల్లు అరవింద్. గీతా గోవిందం దర్శకుడు పరుశరామ్,బొమ్మరిల్లు భాస్కర్‌లను అఖిల్ కోసం లైన్లో పెట్టాడట అల్లు అరవింద్. వీరిద్దరు చెప్పిన కథలు వినమని, నచ్చిన కథతో సినిమా చేద్దాం అని అఖిల్‌తో చెప్పాడట అల్లు అరవింద్. దీంతో ప్రస్తుతానికి ఈ ఇద్దరు దర్శకులు చెబుతున్న కథలను వింటున్నాడట అఖిల్. రీసెంట్ గా గీతా గోవిందం వంటి హిట్ ఇచ్చిన పరుశరామ్ ని ఎంచుకుంటారా..తన కెరీర్ లో బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన భాస్కర్ వైపు మొగ్గు చూపుతాడా చూడాల్సిందే.
- Advertisement -
అఖిల్ కోసం అల్లు అరవింద్‌ను రంగంలోకి దించిన నాగ్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -