Sunday, May 5, 2024
- Advertisement -

అఖిల్ థ్యాంక్యూల ముచ్చ‌ట‌

- Advertisement -

హ‌లో ఆడియో విడుద‌ల అఖిల్ థ్యాంక్యూల మీద థ్యాంక్యూలు

తొలి సినిమా ప‌రాజయం నుంచి అక్కినేని వార‌సుడు బాగానే పాఠాలు నేర్చ‌కున్న‌ట్టు ఉన్నాడు. విశాఖ‌ప‌ట్ట‌ణంలో ఆదివారం (డిసెంబ‌ర్ 10) తాను న‌టించిన హ‌లో సినిమా పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం సంద‌డిగా జ‌రిగింది. అక్కినేని కుటుంబ‌మంతా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైంది. ఈ కార్య‌క్ర‌మంలో అఖిల్ ఉత్సాహంగా ఉన్నాడు. సినిమాపై న‌మ్మ‌కంతో ధీమాగా క‌నిపిస్తూ తాను హిట్ కొట్ట‌డానికి రెడీ మీరు రెడీనా అంటూ ప్రేక్ష‌కుల‌కు స‌వాల్ విసిరాడు. అంద‌రికీ థ్యాంక్యూలు చెప్పుకుంటూ పోయాడు.

మాట్లాడిన రెండు నిమిషాల్లో అంద‌రికీ థ్యాంక్స్ త‌ప్ప ఏమీ చెప్ప‌లేన‌న్నాడు. రెండేళ్లు సినిమా లేకున్నా తన‌ను యాడ్స్‌ల‌లో న‌టించినా అభిమానించినందుకు థ్యాంక్స్ అని చెప్పాడు. హ‌లో సినిమాతో తాను ఎదిగాన‌ని, ఇంత కాన్ఫిడెంట్‌గా మీ ముందు నిలుచోడానికి త‌న అమ్మనాన్న‌లే (నాగార్జున‌, అమ‌ల‌) కార‌ణ‌మ‌ని పేర్కొనన్నాడు. థ్యాంక్యూ అన్నాడు. ప్రియదర్శన్ గారూ.. త‌న‌ కూతురిని సినిమాకు హీరోయిన్‌గా ఇచ్చినందుకు థ్యాంక్యూ. మీరు ఇచ్చిన సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్యూ. త‌న ప్ర‌వ‌ర్త‌న చెప్పేందుకు హలో నిదర్శనం. విక్ర‌మ్ ప‌రిచ‌యంతో త‌న కాన్ఫిడెంట్, ఎన‌ర్జీ లెవెల్స్ పెరిగాయ‌ని, త‌న‌ గురించి త‌న‌కు తెలిసేలా ఈ సినిమా చేసింద‌ని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మీకు థ్యాంక్యూ మాత్రమే చెప్పగలను. అక్కినేని ఫ్యాన్స్ తరఫున విక్ర‌మ్‌కు కృతజ్ఞతలుస‌ అని చెప్పాడు.

‘ఇక అభిమాన దేవుళ్లు అందరికీ.. ప్రస్తుతం త‌న‌ దగ్గర థ్యాంక్స్ తప్ప మరేం లేదు. ఒకటే చెబుతాను.. నేను హిట్టు కొట్టడానికి రెడీ.. మీరు రెడీయా.. కొడుతున్నాం’ అంటూ హై పిచ్‌లో అరిచి మరీ చెప్పి తెగ ఉత్సాహపరిచాడు అఖిల్.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -