Wednesday, May 8, 2024
- Advertisement -

కేంద్రంతో బాబు రాజీప‌డ్డారు… ప్ర‌త్యేక‌హోదాకోసం రాజీనామాల‌కు రెడీ కండీ..?

- Advertisement -

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీకి రావాల్సిన విభ‌జ‌న చ‌ట్టంలోని హామీలు ప్ర‌ధానం కానున్నాయి. ప్ర‌త్యేక‌హోదా కోసం అవ‌స‌రం అయితే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాచేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని వైసీపీ ఎంపీలు తెలిపారు. శీతాకా పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ఆపార్టీ ఎంపీల‌తో జ‌గ‌న్ భేటీ అయ్యారు.

అనంతపురం జిల్లా కూడేరులో పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఎంపీలు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు త‌దిత‌రులు పాల్గొన్నారు. ప్ర‌త్యేక‌హోదా కోసం అవ‌స‌రం అనుంకుంటే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని జ‌గ‌న్‌కు తెలిపారు.

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని, విశాఖకు రైల్వే జోన్ కూడా ఇవ్వాలని వైసీపీ ఎంపీలు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయడానికి ఇప్పటికీ తాము సిద్ధమేనని చెప్పారు. తమ రాజీనామాలతో ప్రత్యక హోదా వస్తుందంటే… స్పీకర్ ఫార్మాట్ లో ఇప్పటికిప్పుడే రాజీనామాలు చేస్తామని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ఎంపీల రాజీనామాల అంశాన్ని మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దది చేసి చూపుతున్నారని మండిపడ్డారు. పార్లమెంటులో స్పెషల్ స్టేటస్ పై చర్చ జరగాలంటే తాము సభలో ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -