Saturday, April 27, 2024
- Advertisement -

అఖిల్ ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ టీజ‌ర్‌ రివ్యూ

- Advertisement -

అక్కినేని న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ ఎందుక‌నో అనుకున్నంత స‌క్సెస్ కాలేదు.త‌ను న‌టించిన మొద‌టి సినిమా డిజాస్టార్ కావ‌డంతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు అఖిల్‌.ఇక రెండో సినిమా హ‌లోతో ఫ‌ర్వాలేదు అనిపించుకున్నాడు.మూడో సినిమాతో తాను ఏంటో ప్రూవ్ చేసుకుని ప‌నిలో ప‌డ్డాడు అఖిల్‌.తొలిప్రేమ సినిమాతో డిసెంట్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి వంటి యంగ్ ద‌ర్శ‌కుడితో క్యూట్ ల‌వ్ స్టోరి చేస్తున్నాడు అఖిల్‌.

తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.దేనిని అయితే మిస్ చేయ‌కూడ‌దో దానినే మిస్ అని అంటున్నాము అంటు అఖిల్ చెప్పిన డైలాగ్ టీజ‌ర్‌కే హైలెట్‌గా నిలిచింది.ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తుంది.బివియ‌స్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్య‌వహరిస్తున్న ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.సినిమాను త్వ‌ర‌గా పూర్తి చేసి డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్న‌హాలు చేస్తున్నారు.మ‌రి ఈ సినిమా అయిన అక్కినేని న‌ట వార‌సుడిగా హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -