భార‌త్‌కు ఎదురు దెబ్బ‌..హార్ధిక్ పాండ్యాకు గాయం…

పాకిస్థాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో భార‌త్‌కు ఎదురు దెబ్బ త‌గిలింది. ఆల్ రౌండ‌ర్ హార్థిక్ పాండ్యా గాయంప‌డ్డారు. 18వ ఓవర్‌లో బౌలింగ్ వేస్తూ.. అతను కిందపడ్డాడు. అయితే బంతిని వేసిన తర్వాత కుడి కాలును నేలపై సరిగా వేయడంలో పాండ్యా ఇబ్బందిపడ్డాడు. కిందపడ్డ తర్వాత పాండ్యా లేవలేకపోయాడు. దాంతో స్ట్రెచర్ తీసుకువచ్చి.. పాండ్యాను తీసుకువెళ్లారు.

దీంతో ఈ ఓవర్‌ చివరి బంతిని రాయుడు వేసాడు. పాండ్యా గాయం భారత్‌కు ప్రతి కూలం కానుంది. అతని గాయం.. భారత బౌలింగ్‌, బ్యాటింగ్‌ల విభాగాలపై దెబ్బపడనుంది.