Monday, May 5, 2025
- Advertisement -

సోల్‌మేట్ వెతికే ప‌నిలో ‘హలో!’

- Advertisement -

త‌న చిన్న‌ప్పుడు త‌న‌కు ద‌గ్గ‌ర‌యి దూర‌మైపోయిన సోల్‌మెట్‌ను 15 ఏళ్ల త‌ర్వాత కూడా వెతుకున్న యువ‌కుడిగా ‘హలో!’లో అఖిల్ క‌నిపించ‌నున్నాడు. త‌న ప్రేయ‌సిని వెతికే ప‌ని నేప‌థ్యంలో హ‌లో సినిమా ఉండ‌నున్న‌ట్టు ‘హలో!’ ట్రైల‌ర్ ద్వారా తెలుస్తోంది. సినిమాకు నిర్మాత‌, అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జున ఈ సినిమా ట్రైల‌ర్‌ను శుక్ర‌వారం విడుద‌ల చేశారు. త‌న తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రధారిగా నటించిన తొలి చిత్రం ‘శ్రీసీతారామజననం’ విడుదలైన రోజు డిసెంబ‌ర్ 1వ తేదీ సంద‌ర్భంగా ఈ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. 73 ఏళ్ల కింద‌టి ఆ రోజుని గుర్తు చేసుకున్నారు. కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయిక. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

అవినాష్‌గా మారిన శీనుకి ఈరోజు అది చాలా ముఖ్యమైన రోజు. అనుకోని సంఘటనలు ఆ రోజు అతడి జీవితాన్ని ఎలా మార్చాయో అంటూ నాగార్జున వాయిస్ ఓవ‌ర్‌తో ‘హలో!’ ట్రైల‌ర్ ప్రారంభ‌మ‌వుతుంది. ఒక ఫోన్ అనేది ఈ సినిమాలో పెద్ద పాత్ర‌గా క‌నిపిస్తోంది. దాని కోసం విల‌న్ల‌ను చంపేసిన‌ట్టు అజ‌య్ అంటాడు. విల‌న్ పాత్ర‌లో అజ‌య్, త‌ల్లిదండ్రులుగా జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ న‌టిస్తున్నారు. యాక్షన్ సీన్స్, పాట‌లు, ఆరాటం ఇలా అన్నీ క‌లుపుతూ ఈ సినిమా ట్రైల‌ర్ ఉంది. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన విడుదల చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -