Saturday, April 20, 2024
- Advertisement -

అఖిల్‌ పై సమంత పోస్టు.. స్పందిస్తున్న నెటిజనులు

- Advertisement -

హీరోయిన్ సమంత .. నాగచైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఆమె పెడుతున్న పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా అక్కినేని ఫ్యామిలీ మెంబర్‌ను ఉద్దేశించి ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం సంచలనంగా మారింది. అక్కినేని అఖిల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సమంత పోస్టు పెట్టింది.

కాస్త ఆలస్యంగా చెప్పినా.. అఖిల్ ఫోటోను షేర్ చేస్తూ.. ఇన్ స్టా గ్రామ్‌లో శుభాకాంక్షలు తెలిపింది. ‘‘హ్యాపీ బర్త్‌డే అఖిల్‌. ఈ సంవత్సరమంతా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. నువ్వు కోరుకున్నవన్నీ దక్కేలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా’’ అంటూ విషెస్ చెప్పింది. ఇప్పుడీ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే సమంత విషెస్ పై అఖిల్ ఇంకా స్పందించలేదు.

చైతూతో విడాకుల తర్వాత సమంత అతడి ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేసింది. చైతన్య గురించి ఎక్కడా ప్రస్తావన తీసుకురావడం లేదు. కానీ అక్కినేని కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తుండటం పలు రకాల చర్చలకు దారి తీస్తోంది.

త్వరలో ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ మూవీ

మహేశ్‌ బాబుతో రాజమౌళి సినిమా… రిలీజ్ ఎప్పుడంటే ?

పూరీ జనగణమనలో హీరోయిన్ ఎవరంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -