Sunday, April 28, 2024
- Advertisement -

Exclusive: చిరంజీవి కత్తి చేయకుండా చేస్తుందెవరు..?

- Advertisement -

ఎక్స్ క్లూజివ్ వార్తలను ముందుగా అందించడంలో ఎప్పుడూ ముందుండే… ఆద్యా న్యూస్ మరో సంచలనాన్ని మీకు అందించబోతోంది. మెగస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గత కొన్ని రోజులుగా వస్తోన్న వార్తలకు షాక్ ఇస్తూ… మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది. బ్రూస్ లీ తర్వాత చిరంజీవి 150 వ సినిమా అని ,151వ సినిమా మొదలవుతుందని ఊరిస్తూ చెపుతోన్న వినాయక్ వెంచర్ పై… నీలి నీడలు కమ్ముకున్నాయి. 

ఏదో అధ్బుతం చేస్తున్నట్లుగా గొప్పకు పోయి…ఏమీ దొరకనట్లు కత్తి అనే డబ్బింగ్ చిత్రాన్ని పట్టుకుని వేలాడుతున్న  మెగా కాంపౌండ్ కు.. ఇపుడు మరో ఎదురు దెబ్బ తగిలింది. చిరు ఇపుడున్న పరిస్థితుల్లో కత్తి రీమేక్ చేసే అవకాశాన్ని కోల్పోయినట్లుగా చెబుతున్నారు.

ఇటు చిరుకే కాదు ఆ సినిమా ఒరిజినల్ వెర్షన్ ను అందించిన అయ్యంగారన్ ఇంటర్నేషనల్ ,లైకా ప్రొడక్షన్స్ లకు అదే పరిస్థితి తలెత్తుతోంది.  కత్తి చిత్రం గురించి ఆద్యా సేకరించిన సీరియస్ మ్యాటర్ లోకి వెళితే….కత్తి చిత్రం అంతా అంటున్నట్లు తమిళ కథ ఏమాత్రం కాదు. ఈ సినిమా కథను విజయ్  అనే  ఓ తెలుగోడు రాసాడు. అతను గతంలో సూపర్ గుడ్ ఫిలింస్ లో డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో పని చేశాడు. ఆ టైమ్లో అతను తాను రాసిన కత్తి అసలు కథను రిజిస్టర్ కూడా చేయించాడు. ఐతే అదే  నాలుగేళ్ల క్రితం ఆర్ బి చౌదరికి తన  కథ గురించి చెప్పగా…హీరో విజయ్ అపాయింట్ మెంట్ తీసుకుని అతనికి కధ వినిపించాల్సిందిగా కోరాడు. విజయ్ కు కథ నచ్చినప్పటికీ.. ఆసాకు ఈసాకు చెప్పి తప్పించుకుని కొంతకాలం తరువాత మురుగదాస్ తో కలిసి విజయ్ అదే కథతో కత్తిని తీసాడు.దానికి నిర్మాత కూడా ఆర్ బి చౌదరి కాదు. దాంతో విజయ్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటినుంచి విజయ్ తనకు జరిగిన అన్యాయంపై బాధపడుతున్నాడు. కరెక్ట్ గా అతనికంటూ ఇపుడు ఓ టైమ్ వచ్చింది. కత్తి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే టైమ్ కు అతను రైటర్స్ ,డైరెక్టర్స్ అసోసియేషన్ ను సంప్రదించాడు.

తన కథను అయ్యంగారన్ ఇంటర్నేషనల్ ,లైకా ప్రొడక్షన్స్  దొంగిలించిన విషయాన్ని అతను అందరికీ విన్నవించుకున్నాడు. వారు అతను రిజిస్టర్ చేసిన కథను తెప్పించుకుని కత్తి చిత్రం కథతో క్రాస్ చెక్ చేశారు.దాదాపు 99 శాతం అదే కథను మురుగదాస్ కత్తిగా తీశాడు.

మురుగదాస్ కు మనవాళ్లు వెంటనే కాల్ చేసి  వారు విజయ్ చెప్పిన కథ గురించి అడుగగా అతను కూడా ఒప్పుకున్నాడు. అయితే సినిమాలో కథ మీదని ఎలా వేసుకున్నారని మన అసోసియేషన్ పెద్దలు అడుగగా …..హీరో విజయ్ నాకు కథ చెప్పాడని మురుగదాస్ సమాధానం చెప్పాడు.దీంతో అసలు విషయం అందరికీ తెలిసింది.ఇక చేసేదం లేక కత్తి తెలుగు రైట్స్ కొన్న ఠాగూర్ మధు…. రైటర్ విజయ్ ను రిక్వెస్ట్ చేశాడు. అతను ఒప్పుకోలేదు.

చివరకు తమిళ నిర్మాతలు ఇష్యూ పెద్దదవుతుందని తెలిసి…వారు కూడా రంగంలోకి దిగారు. ఏకంగా 35లక్షల ఇస్తాం ఇష్యూ చేయకుండా కామ్ అయిపోమన్నారు.మన విజయ్  ససేమిరా అన్నాడు. అతని దృష్టిలో ఈసినిమా కథకు వేరే హీరో ఉన్నాడట.అలాగే తనతో కమిట్ అయిన నిర్మాత కూడా ఉన్నాడని చెప్పడంతో అంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.  

మన విజయ్ అక్కడితో ఊరుకోకుండా హిందీ రీమేక్ చేస్తోన్న సల్మాన్ ఖాన్ ను ఇదే విషయంపై కొశ్చన్ చేస్తున్నాడు. హిందీ రైట్స్ విషయంలోను తనకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నాడు. చివరకు మన డైరెక్టర్స్ ,రైటర్స్ అసోసియేషన్ కూడా రైటర్ విజయ్ కు సపోర్ట్ చేయడంతో చిరంజీవితో కత్తి తిప్పిందామనుకున్న వినాయక్ కు ఆ సినిమా చేయడానికి వీల్లేకుండా  పోయినట్లుంది.

సో ఇంత జరిగాక మరి చిరంజీవిని రైటర్ విజయ్ కత్తి ఎలా చేయిస్తాడనుకుంటున్నారు. అతని దృష్టిలో హీరో వేరే ఎవరో ఉన్నారంటున్నాడు. పోనీ అతనెవరోచెప్పండి. అతన్ని మేము మేనేజ్ చేసుకుంటామని మెగా కాంపౌండ్ చెబుతున్నా…రైటర్ విజయ్ వారి మాట వింటే ఒట్టు.                                                                                                

– సూర్యమ్ కలిదిండి 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -