Tuesday, May 7, 2024
- Advertisement -

టైమింగ్ తో కొడుతున్నారు!

- Advertisement -

హీరోలు తెలివి మీరిపోయారు.ఒక హీరో సినిమాకు క్రేజ్ మ‌రీ ఎక్కువొస్తే….. ఆ సినిమా రిలీజ్ రోజు మరో హీరో పెంట పెట్టాల‌ని చూస్తున్నాడు.ఈ సీన్ బిటౌన్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కూ ఎక్క‌డ చూసినా మ‌న‌కు క‌న‌ప‌డుతుంది.

తాజాగా భ‌జ‌రంగి బాయిజాన్ తో వ‌చ్చిన స‌ల్మాన్ కు షారుక్ ఇలాగే ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని చూశాడు.

బాయిజాన్ రిలీజ్ కు క‌రెక్ట్ గా ఒక రోజు ముందు కింగ్ ఖాన్ ర‌యీస్ టీజ‌ర్ తో వ‌చ్చి హ‌ల్చ‌ల్ చేశాడు.ఇలాంటి సీనే మ‌న‌కు రీసెంట్ గా బాహుబ‌లి విడుద‌ల రోజు క‌నిపించింది.అదే రోజు రామ్ చ‌ర‌ణ్ తేజ్ ప‌ని గ‌ట్టుకుని మ‌రీ ప్రెస్మీట్ పెట్టి ప‌వ‌న్, చిరు సినిమా క‌బుర్ల‌తో పాటు త‌న కొత్త వ్యాపారం గురించి దుకాణం పెట్టాడు. నిజానికి ఈ దుకాణం ఉన్న‌ట్టుండి ఇలా పెట్టాల్సిన అవ‌స‌రం చ‌ర‌ణ్ కు లేదు.

అలాగే అక్కినేని అఖిల్ శ్రీమంతుడు సినిమా రిలీజ్ రోజైన ఆగ‌స్ట్ మొద‌టివారంలోనే త‌న సినిమా గురించి స్పెష‌ల్ ప్ర‌మోష‌న్ చేయాల‌ని షురూ చేశాడు.

ఇలా ఒక‌రికొక‌రు టైమింగ్ తో కొట్టుకోవ‌డం ఏదో గొప్ప అనుకుంటున్నారు గాని… అది ప్రేక్ష‌కుల ముందు  ఎంత చీప్ ట్రిక్ లా క‌నిపిస్తుందో ఎవ్వ‌రికీ తెలియ‌కుండా ఉంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -