Saturday, May 4, 2024
- Advertisement -

‘ హలో ‘ దూకడానికి నేను రెఢీ

- Advertisement -

హలో అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు అఖిల్ రెడీ అయిపోతున్నాడు .అఖిల్ చిత్రం ఇచ్చిన దెబ్బకు సైలంట్ అయిపోయిన మనోడు హలో సినిమాతో సాంతం మగువల మనస్సులను దోచేయాలని డిసైడ్ అయిపోయాడు. ఇందుకోసమని మనం ఫేం విక్రం కుమార్ దర్శకత్వంలో ఈ యువ హీరో నటిస్తున్న ” హలో ” సినిమా పోస్టర్ ను మంగళవారం విడుదల చేశారు.

ఈ నెల 16 న టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఈ పోస్టర్లో ప్రకటించింది. అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై వస్తున్న ఈ మూవీలో ప్రముఖ డైరెక్టర్ ప్రియదర్శన్ కుమార్తె కల్యాణి హీరోయిన్. అనూప్ రూబెన్స్ మ్యాజిక్ డైరెక్టర్. డిసెంబరు 22 న ఈ చిత్రం విడుదల కానుంది. రెండేళ్ళ గ్యాప్ తర్వాత అఖిల్ మళ్ళీ నటిస్తున్న చిత్రమిది. అంతా భాగానే ఉంది కాని.. ఈసినిమా డైరెక్షన్లో వేలు పెట్టేశాడని ఎన్నో కామెంట్లు ఫేస్ చేసిన అఖిల్ ఈసినిమాతో బ్రేక్ తెచ్చుకుంటే మాత్రం… యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -