Thursday, May 2, 2024
- Advertisement -

నాగబాబు సంకుచితత్వం….. చిరు, పవన్‌ల ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తోందా?

- Advertisement -

దాదాపుగా క్రికెట్ టీం అంతమంది హీరోలున్న మెగా ఫ్యామిలీ రాజకీయాలు ఇండస్ట్రీలో మామూలుగా ఉండవు. ఇక 2009 ఎన్నికలకు ముందు నుంచీ రాజకీయాల్లో కూడా హల్చల్ చేస్తోంది మెగా ఫ్యామిలీ. సినిమా, రాజకీయ ప్రస్థానంలో మెగా ఫ్యామిలీ వళ్ళ ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా అంటే ప్రశ్నార్థకమే. కానీ ఎవరైనా విమర్శలు చేస్తే చాలు ఉక్రోశంతో ఊగిపోతూ ఉంటారు. విమర్శలు చేసినవాళ్ళపైన విరుచుకుపడిపోతుంటారు. ఆరెంజ్ సినమా సమయంలో తానే ఎక్కువ నష్టపోయానని చెప్పి బోలెడంత కన్నీటి డ్రామా ప్లే చేసిన నాగబాబు మీడియాలో బీభత్సమైన సానుభూతి సంపాదించుకున్నాడు. కానీ ఆ సినిమా కొన్న బయ్యర్స్, డస్ట్రిబ్యూటర్స్ మాత్రం పూర్తిగా మునిగిపోయారు. వాళ్ళ గురించి మాట్లాడినవాళ్ళు లేరు. రామ్ చరణ్ ఫేస్ ఫీచర్స్ గురించి యండమూరి మాట్లాడితే బహిరంగ వేదికపై నుంచే యండమూరిని బూతులు తిట్టిన నాగబాబు ఇప్పుడు మహేష్ కత్తి రంగు, రూపురేఖలపై మాత్రం సుడిగాలి సుధీర్, హైపర్ ఆది చేత పంచ్‌లు వేయిస్తూ పగలబడి నవ్వేస్తున్నాడు. సిద్ధాంతాలు, విధానాల ప్రాతిపదికగా కత్తి మహేష్‌కి సమాధానం చెప్పే ధైర్యం లేదు. చేసిన తప్పును సమర్థించుకోవడం కూడా కష్టం కాబట్టే ఏమీ చేయలేక మహేష్ కత్తి పేరు, ఆయన రూపు రేఖలపై పంచ్ డైలాగులు పేలుస్తూ శునకానందం పొందుతున్నారు. ఆ మధ్య ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా ‘ద్వేషం చూపిస్తున్నారు’ అని చెప్పి రాజకీయ విమర్శలను ద్వేషంతో పోల్చి అభిమానులను ఇంకాస్త రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

విమర్శలు ఎధురైతే తట్టుకోలేకపోతున్న మెగా ఫ్యామిలీ నటులు ప్రజల విషయంలో చేస్తున్న తప్పులు మాత్రం అన్నీ ఇన్నీ కావు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌తో సహా మోడీ ఇచ్చిన అన్ని హామీలు, చంద్రబాబు ఇచ్చిన హామీలకు నాదీ పూచి అని చెప్పిన పవన్ టిడిపి, బిజెపి గెలుపులో తనవంతు పాత్ర పోషించాడు. ఆ తర్వాత మాత్రం పూర్తిగా చేతులెత్తేశాడు. చంద్రబాబు చెంచాగిరి చేస్తున్నాడు అన్న అపప్రధను మూటకట్టుకున్నాడు. ఈ విషయంలో కొద్దో గొప్పో అనుమానాలున్నవారికి తాజాగా జరిగిన బోటు ప్రమాదం విషయంలో పవన్ స్పందన ఇంకాస్త స్పష్టంగా అర్థమయ్యేలా చేసింది. 21 మంది చనిపోయిన ఒక ప్రమాదం గురించి పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. చంద్రబాబుకు అవరమైనప్పుడే స్పందిస్తాడు, లేకపోతే సైలెంట్ అవుతాడు అని కొంత కాలంగా రాజకీయ విశ్లేషకులు చేస్తున్న విమర్శలను ఆ విధంగా నిజం చేశాడు పవన్. రాజ్యసభ సభ్యత్వం వెలగబెడుతున్న మెగాస్టార్ చిరంజీవి గురించి అయితే అస్సలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ప్రజల మద్ధతు పుణ్యమా అని రాజ్యసభ సభ్యుడు అయిన చిరంజీవి ఆ ప్రజల సమస్యల గురించి కనీస మాత్రంగా కూడా ఎప్పుడైనా స్పందిస్తే ఒట్టు. పవర్ స్టార్ కథ కూడా సేం టు సేం. ప్రజల ఆర్తనాదాలు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను కదిలించలేకపోతున్నాయో లేక చంద్రబాబుతో లాలూచీలు బలంగా పనిచేస్తున్నాయో తెలియదు కానీ ఇద్దరూ కూడా స్టార్ట్, కెమేరా, యాక్షన్ అంటూ సినిమాలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. అది మెగా నాయకుల రాజకీయం తీరు. 2019 ఎన్నికలు దగ్గర పడే సమయానికి ఈ మెగాస్టార్, పవర్ స్టార్‌లు మళ్ళీ పొలిటికల్ తెరపైకి వచ్చి హల్చల్ చేస్తారనడంలో సందేహం లేదు. ఈ సారి అయినా ఆంధ్రప్రదేశ్ జనాలు మెగా రాజకీయాన్ని అర్థం చేసుకుంటారో లేక వెండితెర వెలుగుల మాయలో పడతారో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -