Friday, March 29, 2024
- Advertisement -

దసరా బరిలో ’ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’

- Advertisement -

ఇండస్ట్రీలో అక్కినేని నట వారసునిగా నాగార్జున కొడుకు అఖిల్ యాక్షన్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ అఖిల్’ సినిమాతో ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.తర్వాత హలో, మిస్టర్ మజ్ను వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు అక్కినేని అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి.

ప్రస్తుతం అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్” సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా రెండేళ్ల క్రితం మొదలవ్వగా ఇంతవరకు రిలీజ్ కు నోచుకోలేదు. విడుదల తేదీలను ప్రకటించగా కరోనా పరిస్థితుల కారణంగా మళ్లీ వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాను, బన్నీవాసు నిర్మింస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాకు, గోపీసుందర్ సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతం అఖిల్ ఐదో సినిమా సైరా నరసింహ రెడ్డి ఫేమ్ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్‌’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో ఈ సినిమాలో మొదటిసారి కనిపించనున్నాడు. ‘ఏజెంట్’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.

Also Read: బాబాయే కాదు.. పవన్ నాకు అంతకు మించి.. చరణ్ భావోద్వేగం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -