సర్కారువారి పాటలో గోవా ఫైట్ హైలెట్..!

- Advertisement -

సర్కారువారి పాట సినిమా కోసం మహేశ్​ ఫ్యాన్స్​తోపాటు సినీ అభిమానులంతా ఎంతో ఎదురుచూస్తున్నారు. అయితే లాక్​డౌన్​ ఎఫెక్ట్​తో షూటింగ్​ ఆగిపోయింది. అప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్​ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్​ లో ఉండగా షూటింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం లాక్​డౌన్​ ఎత్తేవేయడంతో దుబాయ్ .. హైదరాబాద్ షెడ్యూల్స్ పూర్తిచేసుకున్నరు చిత్ర యునిట్.

సర్కారువారి పాట సినిమా షూటింగ్ రీసెంట్ గా ‘గోవా’ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. ‘గోవా’లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. రామ్ – లక్ష్మణ్ నేతృత్వంలో ఈ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు. ఈ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయనీ .. ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

- Advertisement -

మైత్రీ మూవీ మేకర్స్ .. 14 రీల్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరక్ర్కిస్తిన్నారు. ఇందులో మహేశ్ బాబు సరసన కీర్తిసురేశ్​ హీరోయిన్​గా నటిస్తుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్యాంకు దోపిడీలు, ఆర్థికవ్యవహారాలకు సంబంధించిన ఓ డిఫరెంట్ సబ్జెక్ట్​తో ఓ మూవీ రాబోతున్నదట. త్వరలోనే మరో షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట. ఆ షెడ్యూల్ షూటింగు దాదాపు హైదరాబాద్ లోనే ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.

Also Read: ఆచార్య విడుదలలో క్లారిటీ ఏదీ..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -